క్రీడాభూమి

ఆ ఒక్కడు చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 16: ఆసియా కప్‌లో మూల‘విరాట్’ను మిస్సవుతున్నా, జట్టును ముందుకు నడిపించగల ‘అందరివాడి’తో ధీమాగా ఉన్నామని హైదరాబాదీ ప్లేయర్ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. ఎలాంటి పరిస్థితులెదురైనా జట్టును ముందుకు నడిపించగల అనుభవజ్ఞుడు మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడన్న ధైర్యం జట్టులో కనిపిస్తోందన్నాడు. ఆరు దేశాల ఆసియా కప్ పోరులో భాగంగా రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీలేని టీమిండియా జట్టు ఆదివారం దుబాయ్‌కి చేరుకుంది. ‘వాస్తవానికి విరాట్ లేకపోవడం జట్టుకు పెద్ద నష్టం. అయినప్పటికీ విజయపథాన నడిపించగల క్వాలిటీ ఆటగాళ్లకు కొదువలేదు. ఒకప్పటి భారత కెప్టెన్, జట్టులో ఎప్పటికీ అందరివాడూ అయిన ధోనీ ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు’ అని రాయుడు వ్యాఖ్యానించాడు. ‘ఈ సీజన్‌లో నేను కోలుకోవడానికి అతను ఎంతో ప్రోత్సహించాడు’ అని చెప్పుకున్నాడు. ప్రపంచ కప్ మరో ఏడాది దూరంలోనే ఉన్నా, టీమిండియా ఇప్పటికీ సరైన మిడిలార్డర్ లేక సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాయుడిని మిడిలార్డర్‌లోకి తీసుకోవచ్చన్న అంచనాలు లేకపోలేదు. ‘నిజానికి మిడిలార్డర్ గురించి నేనసలు ఆలోచించడం లేదు. అలా ఆలోచించి తీవ్ర వత్తిడిని గురవ్వాలనీ అనుకోవడం లేదు. నా ఆలోచన ఒక్కటే. జట్టులో అవకాశం దక్కింది, నన్ను నేను నిరూపించుకోవాలి’ అని రాయుడు స్పష్టం చేశాడు.

బలంగా వస్తే సరే..
టీమిండియాకు చాపెల్ సూచన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ఆస్ట్రేలియా టూర్‌కి ముందే టీమిండియా తన బ్యాటిగ్ లోపాలను సరిదిద్దుకుంటేనే పర్యటనకు ఫలితం ఉంటుందని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సలహానిచ్చాడు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేని ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌పరంగా కొంత ప్రశ్నార్థకమే అయినా, చురకత్తుల్లాంటి బౌలర్లు టీమిండియా ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టే అవకాశం లేకపోలేదన్నాడు. ఓ వెబ్‌సైట్‌కు రాసిన నోట్‌లో ఈ అంశాలను ప్రస్తావించాడు. విరాట్ సారథ్యంలోని టీమిండియా గత ఆస్ట్రేలియా టూర్ తరువాత అటు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యాటక సిరీస్‌లలో చవిచూసిన ఘోర వైఫల్యాన్ని చాపెల్ ప్రస్తావించాడు. ‘్భరత్ తన పూర్వ ప్రఖ్యాతిని తిరిగి సంపాదించుకునే క్రమంలో పునరావాస స్థితిలో ఉంది. ఈ దశలో ఆస్ట్రేలియా టూర్‌కి వచ్చే ముందే బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుని బలోపేతం కావడం ఎంతైనా ముఖ్యం’ అని సూచించాడు.