క్రీడాభూమి

తప్పులతడకగా చెక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో వివిధ పతకాలు సాధించిన అథ్లెట్లకు ఇచ్చే పారితోషికం చెక్కులతో చిక్కులు వచ్చి పడ్డాయి. భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఆసియా క్రీడాకారుల సన్మాన కార్యక్రమం చివరకు అభాసుపాలైంది. నిర్వాహకుల తీరుతో సన్మాన గ్రహీతలతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, అభిషేక్ వర్మతో సహా దాదాపు 15 మంది అథ్లెట్లకు ఇచ్చిన నగదు పురస్కారం చెక్కుల్లో తప్పులు దొర్లాయి. ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లలో గోల్డ్, రజత, కాంస్య పతకాలు సాధించిన అథ్లెట్లకు వరుసగా మూడు లక్షలు, రెండు లక్షలు, లక్ష రూపాయల వంతున నగదు పురస్కారం అందజేయాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. అదేవిధంగా వ్యక్తిగత ఈవెంట్లలో గోల్డ్, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి వరుసగా ఐదు లక్షలు, మూడు లక్షలు, రెండు లక్షలు అందజేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఆయా క్రీడాకారులకు ఆదివారం జరిగే సన్మాన కార్యక్రమంలో సంబంధిత నగదు చెక్కులను అందజేయాల్సి ఉంది. అయితే, దాదాపు 15 మంది అథ్లెట్లకు ఇచ్చే చెక్కులపై పేర్లలో తప్పులు దొర్లాయని, ఇది తమ తప్పేనని, ఇందుకు క్షమించాలని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి సరైన న్యాయం చేస్తామని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా భరోసా ఇచ్చాడు. కాగా, ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ దివ్యా కక్రాన్ పేరును నిర్వాహకులు పూర్తిగా మరచిపోవడం గమనార్హం. దివ్యా కక్రాన్ తల్లిదండ్రులు సన్మాన కార్యక్రమం అనంతరం ఐఓఏ ప్రెసిడెంట్ బాత్రాను కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నుంచి ఐఓఏ ప్రెసిడెంట్‌కు పిలుపు రావడంతో ఆయన సమావేశంలో కక్రాన్‌కు నగదు పారితోషికాన్ని వెల్లడించలేకపోయాడు. ఆ తర్వాత నిర్వాహకులను దివ్యా కక్రాన్ తల్లిదండ్రులు కలసి మాట్లాడినపుడు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్ల జాబితాలో ఆమె పేరు లేదని, ఈ పొరపాటు ఎలా జరిగిందో తమకు తెలియదని స్పష్టం చేశారని కరన్ తల్లి పీటీఐ ప్రతినిధికి తెలిపింది.
కాగా, ఆసియా క్రీడల్లో పాల్గొన్న పలువురు అథ్లెట్లు చక్కని ప్రతిభను కనబరిచారని, అందుకే వారిని సముచిత రీతిన సత్కరించాలని నిర్ణయించడంతోపాటు భవిష్యత్తులో జరిగే ఒలింపిక్, కామనె్వల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో కూడా ఇదే సంప్రదాయం కొనసాగించాలని నిర్ణయించామని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా పేర్కొన్నాడు. రానున్న ఒలింపిక్స్ గేమ్స్‌లో కూడా అథ్లెట్లు అద్భుతంగా రాణించడం ద్వారా మరిన్ని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించాడు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే పారితోషికాలకు స్పాన్సరర్లు నిధులు సమకూర్చారని ఆయన తెలిపాడు. కాగా, అథ్లెట్ల సన్మాన కార్యక్రమానికి ఆసియా క్రీడల్లో గోల్డ్, కాంస్య, రజత పతకాలు సాధించిన క్రీడాకారుల్లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, టెన్నిస్ ఆటగాళ్లు రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేష్ పొగట్, బాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటివారు హాజరుకాలేదు.