క్రీడాభూమి

ప్రపంచ కిక్ బాక్సింగ్‌కు ఏడేళ్ల బాలిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాండిపురా (జమ్మూ కశ్మీర్), ఏప్రిల్ 28: ఇటలీలో జరిగే ప్రపంచ కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు చెందిన ఏడేళ్ల బాలిక తాజముల్ ఇస్లాం పోటీపడనుంది. గత ఏడాది జాతీయ కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్ సబ్ జూనియర్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించిన తాజముల్ జాతీయ చాంపియన్ హోదాలో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సంపాదించిది. శ్రీనగర్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని టార్క్‌పురా గ్రామానికి చెందిన ఈ చిన్నారి బాండిపురాలోని ఆర్మీ గుడ్‌విల్ పాఠశాలలో చదువుతున్నది. తైక్వాండో, ఉషులోనూ అసాధారణ ప్రతిభాపాటవాలను కనబరుస్తున్నది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత లభించడం తన అదృష్టమని, అక్కడ కూడా పతకం సాధించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తాజముల్ గురువారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పింది.