క్రీడాభూమి

నలుగురు రెజ్లర్లపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతా పొగట్, ఆమె సోదరి బబితా కుమారి సహా నలుగురు రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు వారిపై తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలన్న వీరి ఆశలు ఆవిరైపోయాయి. ఈ నిషేధానికి గురైన వారిలో సుమిత్ (పురుషుల 125 కిలోల ఫ్రీస్టయిల్), రాహుల్ అవారే (పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్) కూడా ఉన్నారు. ఈ నలుగురు రెజ్లర్లపై తాత్కాలిక నిషేధం విధించి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే చివరి ఒలింపిక్ అర్హత పోటీల్లో (రెండవ ప్రపంచ క్వాలిఫికేషన్ టోర్నీలో) పాల్గొనకుండా డిబార్ చేశామని డబ్ల్యుఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్ తొమర్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు.