క్రీడాభూమి

అదరగొట్టిన హర్వీందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, అక్టోబర్ 10: ఆసియా పారా గేమ్స్‌లో బుధవారం జరిగిన ఆర్చరీ పోటీలో భారత్‌కు చెందిన హర్వీందర్ సింగ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్ అందుకున్నాడు. డబ్ల్యూ 2/ఎస్‌టీ విభాగంలో జరిగిన ఫైనల్‌లో చైనాకు చెందిన ఝావో లిక్స్యూను 6-0తో ఓడించి హర్వీందర్ సింగ్ గోల్డ్‌మెడల్ కైవసం చేసుకున్నాడు. దీంతో బుధవారంనాటికి భారత్ ఖాతాలో ఏడు గోల్డ్‌మెడల్స్ చేరాయి. కాగా, ట్రాక్ అండ్ ఫీల్డ్ పాల్గొన్న అథ్లెట్లు రజతం, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మోనూ గంగాస్ పురుషుల డిస్కస్‌తో ఎఫ్-11 కేటగిరిలో కాంస్యం, పురుషుల షాట్‌పుట్ ఎఫ్-46 విభాగంలో మహమ్మద్ యాసెర్ రజత పతకం దక్కించుకున్నారు.