క్రీడాభూమి

అస్ట్రేలియా టూర్‌కు డేల్ స్టెయన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహనె్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయన్‌ను ఈ నెలలో అస్ట్రేలియాలో జరిగే పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు ఎంపికయ్యాడు. 15 మందితో కూడిన జాబితాలో స్టెయన్‌తో పాటు కగిసో రబడ, లుంగి ఎంగిడి, వెన్నునొప్పితో బాధపడి తిరిగి కోలుకున్న అల్ రౌండర్ క్రిస్ మోరిస్‌ని జట్టు మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. ఈ టూర్‌లో దక్షిణాఫ్రికా మొత్తం మూడు వనే్డ, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 31 నుంచి కాన్‌బెర్రాలో ప్రెసిడెంట్ ఎలెవన్ మ్యాచ్‌లతో టూర్ ప్రారంభం కానుంది. ఇదిలాఉంటే రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన స్టెయన్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఇమ్రాన్ తాహీర్‌కు తోడు స్టెయన్ రావడంతో జట్టు మరింత బలపడిందని టీమ్ సెలక్షన్ మెంబర్ లిండా జొండి అన్నారు. లిండా మాట్లాడుతూ క్రిస్ మోరిస్ పూర్తిస్థాయ ఫిట్‌నెస్ సాధించి టైటాన్స్ ఫ్రంచైస్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో 12 వికెట్లు తీసినట్లు చెప్పారు. బౌలింగ్‌తోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణించగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు స్టార్ బ్యాట్ సమెన్లు హషీమ్ అమ్లా, జేపీ డూమిని గాయాల కారణంగా సిరీస్‌కు దురమయ్యారని చెప్పారు.
జట్టు వివరాలు: ఫాప్ డూప్లెసిస్ (కెప్టెన్), ఫర్హాన్ బెహర్డియన్, క్వాంటన్ డికాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఇమ్రాన్ తాహీర్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్‌క్రం, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, లుంగి ఎంగిడి, అండిల్ ఫెలాక్వే, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రయజ్ షంసీ, డెయల్ స్టెయన్.