క్రీడాభూమి

ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీలో భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మస్కట్, అక్టోబర్ 19: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన పురుషుల హాకీ తొలి పోటీలో ఆతిధ్య ఒమన్‌పై భారత్ 11-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ జట్టులో లలిత్ ఉపాధ్యాయ తొలి క్వార్టర్‌లో 17వ నిమిషంలో తొలి గోల్ చేసి, రెండో క్వార్టర్‌లో మరో మూడు గోల్స్ చేశాడు. హర్మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, మన్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్, గుజరంత్ సింగ్, అక్షదీప్ సింగ్, చింగ్లెన్‌సానా సింగ్ గోల్స్‌లో జట్టును విజయపథంలో నిలిపారు. దిల్‌ప్రీత్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. కాగా, టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో తాము శుభారంభంతో విజయం సాధించినా, శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో గట్టి పోటీ ఎదుర్కోనున్నామని భారత కోచ్ హరేందర్ సింగ్ అన్నాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు ఆటగాళ్లలో తొమ్మిదిమంది అద్భుతమైన గోల్స్ సాధించి ఆతిథ్య ఒమన్ టీమ్ ను మట్టికరిపించారని పేర్కొన్నాడు. ఇటీవల జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో తమ పురుషుల జట్టు నిరాశపరిచినా, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం, పాక్‌తో పోరాడేందుకు జరిగే మ్యాచ్‌లో బాగా రాణించేందుకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో గెలుపు ఎంతో దోహదపడుతుందని అభిప్రాయపడ్డాడు. మరోపక్క మాజీ చాంపియన్స్ పాకిస్తాన్ శుక్రవారం దక్షిణ కొరియాతో జరిగే మ్యాచ్‌లో తలపడిన తర్వాత తమతో పోరాడుతుందని అన్నాడు.