క్రీడాభూమి

జాతీయ జట్టులో ఎంపికకు ‘యోయో’ ప్రామాణికం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, నవంబర్ 3: ఆటగాళ్ల ఎంపికకు యోయో ఫిట్నెస్ టెస్టు ఒక్కటే ప్రామాణికం కాదని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. ఫిట్నెస్ పరంగా సిద్ధంగా ఉన్నారా? లేదా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, కానీ గత కొనే్నళ్లుగా యోయో టెస్టుల పేరిట క్రికెటర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నాడు. ఎకామా స్పోర్స్ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ శనివారం జరిగిన కార్యక్రమంలో కైఫ్ మాట్లాడాడు. మైదానంలో ఆడేందుకు తగిన ఫిట్నెస్ సామర్థ్యం అవసరమని, భారత క్రికెటర్లలో చాలామంది బాగా పరిణితి చెందారని అన్నాడు. అయితే ఆటగాళ్ల ఎంపికలో సమతూకం పాటించే దిశగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ‘ఆటగాడు వివిధ మ్యాచ్‌లలో పరుగులు చేసినా, వికెట్లు తీసినా యోయో టెస్టుల పేరిట అతనిని తప్పించడం సరికాదు’ అని అన్నాడు. ఇందుకు ఉదాహరణగా కొంతకాలం కిందట టీమిండియాలో అంబటి రాయుడు పేరును ప్రస్తావించాడు. ఐపీఎల్‌లో 600 పరుగులు చేసిన రాయుడిని రెండేళ్ల తర్వాత గానీ జాతీయ జట్టులోకి తీసుకోలేదని, ఇందుకు యోయో టెస్టులో విఫలమైనట్టు పేర్కొన్నారని అన్నాడు. అయితే, ఆ తర్వాత యోయో టెస్టులో పాసైన రాయుడు మళ్లీ ఇటీవల ఆసియా కప్‌లో చోటు దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేశాడు.