క్రీడాభూమి

చైనా ఓపెన్..రెండో రౌండ్‌లో సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫుజ్‌హౌ (చైనా), నవంబర్ 6: భారత మహిళా స్టార్ షట్లర్ పీవీ సింధు మంగళవారం ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో రష్యా క్రీడాకారిణి, అన్‌సీడెడ్ ఎవ్‌జెనియా కొసెట్‌స్కాయాను ఆమె 21-13, 21-19 తేడాతో ఓడించింది. ఒలింపిక్ సిల్వర్ పతక విజేత, మూడో సీడెడ్ క్రీడాకారిణి సింధు 30 నిమిషాల కంటే ముందే ప్రత్యర్థిపై పైచేయి సాధించి తొలిరౌండ్‌ను ముగించింది. సింధు రెండో రౌండ్‌లో థాయిలాండ్ క్రీడాకారిణి అన్‌సీడెడ్ బుసానన్ ఒంబ్గామ్‌రుంగ్‌ఫాన్‌తో తలపడుతుంది.