క్రీడాభూమి

ఆస్ట్రేలియా క్రికెట్ బాగుకోసం... మాజీ సీనియర్లను ఆహ్వానించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: గత కొంతకాలం నుంచి వివాదాలు, ఇబ్బందులు, బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ మునుపటి ప్రాభవాన్ని దక్కించుకునేందుకు మాజీ సీనియర్ల సేవలను సక్రమంగా వినియోగించువాలని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హితవు పలికాడు. మెల్బోర్న్ హెరాల్డ్ సన్ పత్రికలో ఒక కాలమ్‌లో ఆయన పై విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహా ముగ్గురు అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఏడాదిపాటు నిషేధం విధించడంతోపాటు పలు వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బాగుపడేందుకు మాజీ సీనియర్ల సేవలు ఎంతో ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో చోటుచేసుకున్న పలు వివాదాలు, సమస్యలు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ‘క్రికెట్‌కు మళ్లీ పూర్వవైభవం తెండి’ అన్న వ్యాఖ్యలను షేన్ వార్న్ ఉటంకించాడు. ఆస్ట్రేలియా ఫేవరిట్ క్రీడ అయిన క్రికెట్‌కు మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు వీలుగా సీనియర్ల సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని నొక్కిచెప్పాడు. తమ సేవలను దేశ క్రీడా ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు రిటైర్డ్ క్రికెటర్లు తమ సేవలను ఇతోధికంగా అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. తన వ్యక్తిగత విషయానికి వస్తే దేశ క్రికెట్ మనుగడ సాధించేందుకు పూర్వవైభవం సంతరించుకునేందుకు తన సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలనుకుంటే తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ను బతికించేందుకు, జట్టు యాజమాన్యానికి తన సేవలను ఇతోధికంగా అందించేందుకు తగిన పాత్ర పోషించేందుకు తాను తీసుకున్న నిర్ణయంతో ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. రిటైర్డ్ స్టార్ ఆటగాడు మిచెల్ క్లార్క్‌ను బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించాడు. అదేవిధంగా గ్లెన్ మెక్‌గ్రాత్ వంటివారికి ఫాస్ట్‌బౌలింగ్ విభాగంలో మరింత సేవలు అందించేందుకు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నాడు. తనలాంటి సీనియర్ల సేవలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంతో రానున్న రోజుల్లో ఎంతోమంది స్పిన్నర్లను తయారుచేయవచ్చునని అన్నాడు. సమర్థులైన క్రికెటర్లను అందించేందుకు మాజీల సేవలను వినియోగించుకోవాలని షేన్ వార్న్ మరోసారి సమర్థించుకున్నాడు.