క్రీడాభూమి

సమష్టిగా రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: భువనేశ్వర్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో భారత్ శుభారంభం చేసిందని, ఈ ఒరవడిని కొనసాగించాలంటే అంతా సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందని ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ హితవు పలికాడు. ఇక్కడ గురువారం జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరైన అతను విలేఖరులతో మాట్లాడుతూ భారత్ ఆటతీరు సంతృప్తికరంగా ఉందన్నాడు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 5-0 తేడాతో చిత్తుచేసిన భారత్ ఆతర్వాత పటిష్టమైన బెల్జియంను ఢీకొని, 2-2గా మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. ఈ గ్రూపులోని నాలుగో జట్టయిన కెనడాతో మ్యాచ్ మిగిలి ఉండగా, క్వార్టర్ ఫైనల్స్ చేరే అవకాశాన్ని గోల్‌కీపర్ శ్రీజేష్ నాయకత్వంలోని భారత జట్టు మెరుగుపరచుకుంది.