క్రీడాభూమి

జోత్స్నకు మళ్లీ 13వ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 5: భారత స్క్వాష్ స్టార్ జోత్స్న చిన్నప్ప గురువారం తాజాగా విడుదలైన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 13వ ర్యాంకుకు చేరుకుంది. దీంతో ఆమె గత ఏడాది డిసెంబర్‌లో కోల్పోయిన ర్యాంకును మళ్లీ కైవసం చేసుకున్నట్లయింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత స్థానంలో నిలిచిన భారత క్రీడాకారిణి చిన్నప్పే. తాజా ర్యాంకింగ్స్‌లో దీపికా పల్లికల్ 19వ స్థానాన్ని నిలబెట్టుకోగా, పురుషుల విభాగంలో సౌరవ్ ఘోసల్ (18వ స్థానం), మహేష్ మంగావ్‌కర్ (58వ స్థానం), విక్రమ్ మల్హోత్రా (92వ స్థానం) ర్యాంకులు కూడా మారలేదు. అయితే హరీందర్ పాల్ సంధు ఒక స్థానం దిగజారి 67వ ర్యాంకుకు చేరుకోగా, కుష్ కుమార్ ఒక ర్యాంకును మెరుగుపర్చుకుని 94వ ర్యాంకుకు ఎగబాకాడు. అలాగే మహిల విభాగంలో సచికా ఇంగాలే 82వ ర్యాంకులో నిలిచింది.