క్రీడాభూమి

సూపర్ కీపర్ రిషభ్ పంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్ : భారత యువ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ సోమవారం ఆస్ట్రేలియాతో ముగిసిన మొదటి టెస్టులో మొత్తం 11 క్యాచ్‌లు పట్టి, రికార్డుల పుటల్లో చోటు దక్కించుకున్నాడు. ఒక టెస్టులో అత్యధికంగా 11 క్యాచ్‌లు అందుకున్న కీపర్లు జాక్ రసెల్ (ఇంగ్లాండ్/ 1995లో దక్షిణాఫ్రికాపై జొహానె్నస్‌బర్గ్‌లో), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా/ 2013లో పాకిస్తాన్‌పై జొహానె్నస్‌బర్గ్‌లో) సరసన పంత్‌కు చోటు దక్కింది. కాగా, భారత్ తరఫున ఒక టెస్టులో ఎక్కువ క్యాచ్‌లు పట్టుకున్న కీపర్‌గా వృద్ధిమాన్ సాహా పేరిట ఉన్న రికార్డును పంత్ అధిగమించాడు.

చిత్రం..రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ను అభినందిస్తున్న భారత వికెట్‌కీపర్ రిషభ్ పంత్