క్రీడాభూమి

ఆ తప్పు మళ్లీ జరిగితే కోహ్లీపై నిషేధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒక మ్యాచ్ నుంచి నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న తొమ్మిదో ఎడిషన్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ జట్టు తదుపరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటుకు పాల్పడితే కోహ్లీపై ఈ వేటు తప్పకపోవచ్చు. ఇప్పటివరకూ ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ధేశిత సమయంలో తమ ఓవర్లను పూర్తి చేయడంలో కూడా తరచూ విఫలమవుతోంది. ఈ తప్పిదాలకు ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ నేరుగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుత ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు ఇప్పటికే రెండుసార్లు ఇటువంటి తప్పులకు పాల్పడటంతో మొదట రూ.12 లక్షలు, ఆ తర్వాత రూ.24 లక్షల చొప్పున కోహ్లీకి జరిమానా విధించారు. తదుపరి మ్యాచ్‌లో కూడా ఆ జట్టు ఇదేవిధమైన తప్పుచేస్తే ఈసారి కోహ్లీకి రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు ఐపిఎల్ నిబంధనల ప్రకారం అతడిని ఒక మ్యాచ్ నుంచి నిషేధించేందుకు వీలుంటుంది. ప్రస్తుత సీజన్‌లో కోహ్లీ ఇప్పటివరకూ ఏడు ఇన్నింగ్స్‌లో 433 పరుగులు సాధించి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గత నెల 22వ తేదీన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్లోఓవర్ రేట్‌కు పాల్పడటంతో కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించిన ఐపిఎల్ నిర్వాహకులు, ఆ తర్వాత గత సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రాయల్ చాలెంజర్స్ ఇదే తప్పును పునరావృతం చేయడంతో కోహ్లీకి మరో రూ.24 లక్షల జరిమానా విధించారు. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ శనివారం బెంగళూరులోని తమ సొంత గ్రౌండ్‌లో ఆడే తదుపరి మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.

చిత్రం ఐపిఎల్-9 లీడింగ్ స్కోరర్ విరాట్ కోహ్లీ