క్రీడాభూమి

స్పిన్నర్ తప్పనిసరి: షమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా గడ్డపై పెర్త్‌లో పేస్, బౌన్స్‌కు సహకరించే పచ్చటి మైదానంలో ఆశించిన ఫలితాలు రావాలంటే స్పిన్నర్ ఆవశ్యకత ఎంతో ఉందని టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అభిప్రాయపడ్డాడు. ఆసిస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో షమీ 56 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అయితే, ప్రత్యర్థి స్పిన్నర్ నాథన్ లియాన్ తన అద్భుత ప్రదర్శనతో 7 వికెట్లు తీసుకోవడంతో భారత్ ముందు 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసిస్ 243 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆట ముగిసేసరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. భారత్ జట్టులో ఒక్కరైనా స్పిన్నర్ లేని లోటు స్పష్టం కనిపిస్తోందన్న షమీ ఈ విషయంలో టీమ్ మేనేజిమెంట్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోలేం అని అన్నాడు. చాలాకాలం తర్వాత విదేశాల్లో ఆడుతున్న టీమిండియా మొత్తం పేస్ బౌలర్లతోనే లైన్ అండ్ లెంగ్త్‌లో రాణిస్తున్న విషయాన్ని ప్రస్తావించాడు. నాలుగేళ్ల క్రితం వరకు ఇలాంటి పరిస్థితి లేదని అన్నాడు.

చిత్రం..మహమ్మద్ షమీ 6/56