క్రీడాభూమి

ఐదో టైటిల్‌కు అడుగు దూరంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 6: స్పెయిన్‌లో జరుగుతున్న మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వనియా కింగ్ (అమెరికా), అల్లా కుద్రవ్సెవా (రష్యా) జోడీని మట్టికరిపించారు. 50 నిమిషాల పాటు పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా, హింగిస్ 6-2, 6-0 తేడాతో ఘన విజయం సాధించి ఈ ఏడాది ఐదో టైటిల్‌కు మరో మెట్టు దూరంలో నిలిచారు. ప్రస్తుత సీజన్‌లో సానియా, హింగిస్ ఇప్పటికే సిడ్నీ, బ్రిస్బేన్, ఆస్ట్రేలియా ఓపెన్, సెయింట్ పీటర్స్‌బర్గ్ టోర్నీలో టైటిళ్లు సాధించిన విషయం విదితమే. అయితే స్టట్‌గార్ట్ టోర్నీలో ద్వితీయ స్థానంలో నిలిచి రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకున్న సానియా, హింగిస్ ఆ తర్వాత డబ్ల్యుటిఎ టోర్నీ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి. గత ఏడాది నుంచి వరుస విజయాలతో జైత్రయాత్ర సాగించి తొమ్మిది టైటిళ్లు సాధించిన సానియా, హింగిస్‌కు ఇటీవల బ్రేకు పడిన విషయం విదితమే. ఆ తర్వాత వీరు నాలుగు జట్ల చేతిలో పరాజయాలను ఎదుర్కొన్నారు. ఈ నాలుగు జట్లలో వనియా, అల్లా జోడీ కూడా ఉంది. ఇండియన్ వెల్స్ టోర్నీ రెండో రౌండ్‌లో వనియా, అల్లా జోడీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న సానియా, హింగిస్ ప్రస్తుతం విజృంభించి ఆడి కేవలం 50 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించడం విశేషం. మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ కోసం వీరు ఐదో సీడ్ కరోలిన్ గార్సికా, క్రిస్టినా మ్లదెనొవిచ్ జోడీతో తలపడనున్నారు. అంతకుముందు సానియా, హింగిస్ గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో 6-3, 6-2 తేడాతో ఆరో సీడ్ ఆండ్రియా హ్లవకోవా, లూసీ హార్డెకా జోడీపై విజయం సాధించారు.
నిరాశపర్చిన భూపతి
కాగా, పురుషుల డబుల్స్ విభాగంలో భారత ఆటగాడు రోహన్ బొపన్న, అతని భాగస్వామి ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా) మూడో రౌండ్‌లో ప్రవేశించారు. రెండో రౌండ్‌లో 6-7, 6-4, 10-4 తేడాతో పాబ్లో క్యువాస్, మార్సెల్ గ్రానోలర్స్ జోడీపై విజయం సాధించిన బొపన్న, మెర్గియా తదుపరి రౌండ్‌లో హెన్రీ కొంటినెన్, జాన్ పీర్స్ జోడీతో తలపడనున్నారు. అయితే పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు మహేష్ భూపతి, అతని భాగస్వామి ఫాబ్రైస్ మార్టిన్ 3-6, 6-4, 6-10 తేడాతో అలెగ్జాండర్ పెయా, నెనద్ జిమోంజిక్ చేతిలో ఓటమి పాలవడం భారత అభిమానులను నిరాశపర్చింది.