క్రీడాభూమి

విశాఖ వాసులకు నేడు క్రికెట్ విందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 7: విశాఖపట్నం వాసులకు మరో ఐపిఎల్ విందు సిద్ధమవుతోంది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ మధ్య జరిగే మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. పటిష్టమైన గుజరాత్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ఓడించి మంచి ఊపుమీద ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకవైపు, గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, రైజింగ్ పుణె పంజాబ్ జట్లపై విజయాలను నమోదు చేసి, సుమారు వారం రోజులు విశ్రాంతి తీసుకున్న ముంబయి మరోవైపు పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి. హార్డ్ హిట్టర్ డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్ రైజర్స్ జట్టులో అతనితోపాటు శిఖర్ ధావన్ తప్ప చెప్పుకోగద్గ స్టార్లు లేరు. దీపక్ హూడా, మోజెస్ హెన్రిక్స్, ఇయాన్ మోర్గాన్ కొంత వరకు పేరుపొందిన ఆటగాళ్లేగానీ ముంబయితో పోల్చదగ్గ స్థాయిగల వారు కారు. అయితే, సమష్టి కృషితో ఏదైనా సాధించవచ్చని, ప్రతి ఒక్కరూ తమతమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే గెలుపు అసాధ్యమేమీ కాదని సన్ రైజర్స్ నిరూపిస్తున్నది. ఇప్పటి వరకూ జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఈ జట్టు ఐదు విజయాలను సాధించింది. మూడు పరాజయాలను ఎదుర్కొంది. కాగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబయి ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, ఐదు విజయాలను నమోదు చేసింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు జట్లు చెరి పది పాయింట్లతో సమానంగా కనిపిస్తున్నా, సన్ రైజర్స్ కంటే ముంబయి ఒక మ్యాచ్ అధికంగా ఆడింది కాబట్టి సహజంగానే ఒత్తిడికి గురవుతుంది. పైగా, హోం గ్రౌండ్‌లో ఆడాల్సిన మ్యాచ్‌లను మరో కేంద్రంలో ఆడాల్సి రావడం ముంబయిని వేధిస్తున్న మరో సమస్య. నీటి ఎద్దడి కారణంగా మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లను నిర్వహించరాదని బొంబయి హైకోర్టు స్పష్టం చేయడంతో విశాఖను ముంబయి హోం గ్రౌండ్‌గా ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. పిచ్ స్వభావంతో సంబంధం లేకుండా బౌలర్లపై విరుచుకుపడే అంబటి రాయుడు, పార్థీవ్ పటేల్, జొస్ బట్లర్, కీరన్ పోలార్డ్, కృణాల్ పాండ్య తదితరుల అండతో సన్‌రైజర్స్‌ను ఓడించాలని ముంబయి ఆశపడుతున్నది. అయితే, వార్నర్ సేన కూడా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో, సమవుజ్జీల పోరు అభిమానులను ఆకట్టుకోనుంది.
మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకు మొదలు.

చిత్రం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియంలో శనివారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన ముంబయ ఇండియన్స్ క్రికెటర్లు