క్రీడాభూమి

ప్చ్... అడ్డుపడ్డ వరుణుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 5: మ్యాచ్ చేతిలోకి వచ్చింది! ఇంకో నాలుగు వికెట్లు పడితే ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ముగిసినట్లే! అవసరమైతే ఫాలో ఆన్ ఆడించి ఒక్కరోజు ముందుగానే మ్యాచ్‌ను గెలవొచ్చు అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా వెలుతురు లేమి, వరుణుడు అడ్డుపడ్డాడు! మరో ఆలోచన లేకుండా గంటన్నర ముందే అంపైర్లు మూడోరోజు ఆట ముగిసినట్లుగా ప్రకటించారు! దీంతో చివరి సెషన్‌లో ఆసీస్‌ను ప్యాకప్ చేయాలని భావించిన టీమిండియాతో పాటు అభిమానులు నిరాశ చెందారు. సిడ్నీ మైదానంలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. శనివారం మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 24తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఓపెనర్లు మార్కస్ హారిస్, ఉస్మాన్ ఖాజా నిలకడగా ఆడేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన కుల్దీప్ యాదవ్ ఖావాజా (27)ను అవుట్ చేశాడు. మిడ్ వికెట్‌లో ఉన్న పూజరాకు క్యాచ్ ఇవ్వడంతో ఖావాజా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ లాబుస్చాన్‌తో కలిసి హారిస్ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. 42.6 ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన బంతికి హారిస్ (79) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన షాన్ మార్ష్ (8) జడేజా వేసిన బంతిని చెత్తగా ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. అప్పటివరకు నిలకడగా ఆడిన లాబుస్చాన్ (38)ని షమీ అద్భుత బంతితో పెవిలియన్‌కు పంపాడు. అప్పటికీ ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. వరుసగా వికెట్లు పడుతుండగా క్రీజులో ట్రావిస్ హెడ్, పీటర్ హాండ్ సకాబ్ ఉన్నారు. వీరిద్దరూ క్రీజులో కుదురుకున్నాక కుల్దీప్ యాదవ్ వేసిన ఫుల్ టాస్ బాల్‌ను అంచనా వేయని హెడ్ (20) అతడికే క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా అవుటయ్యాడు. అప్పటికీ మంచి ఫాంలో ఉన్న కుల్దీప్ ఆ తర్వాతి ఓవర్‌లోనే ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ (5) ను బౌల్డ్ చేశాడు. 198 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయన ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. పైన్ తర్వాత క్రీజులోకి వచ్చిన కమ్మిన్స్, హాండ్స్‌కాబ్‌తో కలిసి నిలకడగా ఆడారు. వీరిద్దరూ కలిసి జట్టు స్కోరును ముందుకు నడిపించారు. ఇక చివరి సెషన్‌లో ఆసీస్‌ను ఆలౌట్ చేసి ఫాలో ఆన్ ఆడించాలన్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లినట్లయంది. బ్యాడ్ లైట్‌కు తోడు వర్షం పడడంతో ఆటను గంటన్నరు ముందే అంపైర్లు నిలిపివేసారు. దీంతో నాలుగో రోజు ఆట గంటన్నరు ముందుగానే ప్రారంభం కానుంది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి, ప్రత్యర్థి జట్టు కంటే 386 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు చేతిలో నాలుగే వికెట్లు ఉండడంతో ఆసీస్‌కు ఫాలో ఆన్ ప్రమాదం పొంచి ఉంది. ఫాలో ఆన్ నుంచి గట్టేక్కాలంటే మరో 187 పరుగులు చేయాలి. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా 2, మహ్మద్ షమీ ఒక వికెట్ తీసుకున్నాడు.
ఫాలో ఆన్ ఆడిస్తారా?
మూడో టెస్టులో ప్రత్యర్థి జట్టును ఫాలో ఆన్ ఆడించే అవకాశమున్నా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా వెనువెంటనే వికెట్లు కోల్పోయంది. ప్రస్తుతం చివరి టెస్టులోనూ ఆసీస్ జట్టును ఫాలో ఆన్ ఆడించే అవకాశముంది. ఆసీస్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే 187 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఒకవేళ తొందరగా ఆలౌట్ అయతే కోహ్లీ ప్రత్యర్థి జట్టును ఫాలో ఆన్ ఆడిస్తాడో లేదో అనేది చూడాలి.
స్కోర్ బోర్డు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 622/7
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మార్కస్ హారిస్ (బీ) రవీంద్ర జడేజా 79; ఉస్మాన్ ఖాజా (సీ) పుజారా (బీ) కుల్దీప్ యాదవ్ 27; మామస్ లాబుస్చాన్ (సీ) రహానె (బీ) షమీ 38; షాన్ మార్ష్ (సీ) రహానె (బీ) రవీంద్ర జడేజా 8; ట్రావిస్ హెడ్ (సీ), (బీ) కుల్దీప్ యాదవ్ 20; పీటర్ హాండ్స్‌కాబ్ 28 (బ్యాటింగ్); టిమ్ పైన్ (బీ) కుల్దీప్ యాదవ్ 5; పాట్ కమ్మిన్స్ (బ్యాటింగ్)25;
ఎక్‌స్ట్రాలు: 6; మొత్తం: 236 (83.3ఓవర్లలో, 6 వికెట్ల నష్టానికి)
బౌలింగ్ : మహమ్మద్ షమీ 16-1-54-1, జస్ప్రీత్ బూమ్రా 16-4-43-0, రవీంద్ర జడేజా 27.3-9-62-2, కుల్దీప్ యాదవ్ 24-6-71-3.