క్రీడాభూమి

30 ఏళ్ల తర్వాత ఆసీస్ తొలి ‘సారి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 6: ఒకప్పుడు వరుస టెస్టు విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా ఇటీవలి కాలంలో ఓటముల నుంచి బయటపడేందుకు నానాతంటాలు పడుతోంది! ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో రెండో టెస్టును అతి కష్టంగానే గెలిచింది! నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ఓడి, మరో టెస్టు పరాజయం ముంగిట నిలిచింది! సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో సొంత గడ్డపై 30 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ ఆడింది! 1988లో ఇదే మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఫాలో ఆన్ ఆడిన ఆస్ట్రేలియా డ్రాతో గట్టెక్కింది! ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడడంతో నాలుగో రోజు ఆట కేవలం 25.2 ఓవర్లే సాగింది! ఫలితానికి మరో రోజు మిగిలి ఉండడం, బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫలమవడం ఆసీస్‌ను కంగారెత్తిస్తోంది! ఇదిలా ఉంటే కోహ్లీ సేన చివరి టెస్టు గెలిచి, ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించిన మొదటి భారత జట్టుగా చరిత్ర సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతోంది! వరుణుడు అడ్డుపడకపోతే తమ విజయాన్ని ఎవరూ ఆపలేరనే ధీమాగా ఉంది! మరోవైపు ఆతిథ్య జట్టు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది! గెలుపు సంగతి పక్కనబెడితే, మ్యాచ్‌ను డ్రా చేసుకునే పరిస్థితి కనిపించలేదు! ఇటీవల దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లను చూస్తే ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ పరిస్థితి చెప్పకనే అర్థమవుతోంది! జట్టులో సీనియర్ ఆటగాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు రిటైర్మైంట్ ప్రకటించడం, తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకోవడం జట్టును మానసికంగా దెబ్బతీసిందనే చెప్పుకోవాలి.

చిత్రం..ఐదు వికెట్లు తీసిన కుల్దీప్‌యాదవ్‌ను అభినందిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సహచరలు