క్రీడాభూమి

టాప్-3 బ్యాట్స్‌మెన్‌పైనే దృష్టి : ఫించ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 11: పర్యాటక భారత్‌తో శనివారం జరిగే తొలి వనే్డలో ప్రత్యర్థి జట్టులోని తొలి ముగ్గురు ఆటగాళ్లను పడగొట్టడంపైనే తాము దృష్టిని కేంద్రీకరిస్తామని ఆతిధ్య ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. టెస్టు సిరీస్‌లో ఓటమిని చవిచూసిన ఆసిస్ శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడు వనే్డల సిరీస్‌లో తన సత్తా చూపేందుకు సిద్ధమైంది. ప్రత్యర్థి టీమ్‌లోని టాప్-3 ఆటగాళ్లను ఆదిలోనే దెబ్బతీయడం ద్వారా వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తామని ఆసిస్ కెప్టెన్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని త్వరితగతిన పెవిలియన్ పంపేందుకు తాము ప్రణాళికను రచిస్తున్నామని అన్నాడు. గడిచిన 12 నెలల కాలంలో విరాట్ కోహ్లీ సగటు పరుగులు 133, శిఖర్ ధావన్ 75, రోహిత్ శర్మ 50. కనుక పరుగుల వరద సృషించగల అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను దెబ్బతీయడమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నాడు. టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయడం వల్ల మిడిలార్డర్‌లో రానున్న ధోనీ, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్‌ను పంపించడం సులువు అవుతుందని అన్నాడు.