క్రీడాభూమి

10వేల పరుగుల క్లబ్‌లో ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవ రి 12: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ వనే్డల్లో 10వేల పరుగుల మైలురాయి ని దాటాడు. భారత ఇన్నింగ్స్ 6వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీయడంతో 333వ వనే్డలో ఈ మార్క్‌ను సాధించాడు. ఇంతకుముందు ఐసీసీ తరఫున ఆసియా ఎలెవన్ జట్టుకు ఆడిన వనే్డలో 174 పరుగులు సాధించ డంతోనే 10వేల పరుగులను పూర్తి చేసుకున్న ధోనీ, భారత్ జట్టు బ్యాట్స్‌మన్‌గా ఈ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా తన పేరిట రికార్డు నెలకోల్పాడు. ధోనీకి ముందు ఈ ఫీట్ సాధించిన భారత బ్యాట్స్‌మెన్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.