క్రీడాభూమి

ముర్రే ప్రకటనతో షాక్: ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ టెన్నిస్ స్టార్ దిగ్గజ ఆటగాడు ఆండీ ముర్రే అనారోగ్య పరిస్థితుల కారణంగా మొత్తం టెన్నిస్ రంగం నుంచే రిటైరవుతున్నట్టు ప్రకటించడం తనను షాక్‌కు గురిచేసిందని ప్రపంచ నెంబర్ మూడో సీడ్ రోజర్ ఫెదరర్ అన్నాడు. ముర్రే తీసుకున్న తాజా నిర్ణయం మొత్తం టెన్నిస్ ప్రపంచానికే తీరని లోటని అభివర్ణించాడు. తన క్రీడా జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఆండీ ముర్రే వింబుల్డన్ టోర్నీతో తన కెరీర్‌కే గుడ్‌బై చెప్పాలని ప్రకటించడం విచారకరమని అన్నాడు. ‘ముర్రే ఆకస్మిక ప్రకటనతో నిరాశచెందాను. ఈ సంచలన ప్రకటన నన్ను కొంతవరకు షాక్‌కు గురిచేసింది. ఏదేమైనా టెన్నిస్ రంగం గొప్ప ఆటగాడిని కోల్పోతోంది’ అని ఫెదరర్ ఆదివారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నాడు. ‘ముర్రే ఎంతోమంది మాలాంటి ఆటగాళ్లను ఎదుర్కొన్నాడు. అతని ఆటతీరు మాకెంతో ఇష్టం. అతనికి శత్రువులెవరూ లేరు. నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు, అనుకున్న విజయాలను అందుకున్నాడు. రెండుసార్లు వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడాడు’ అని అన్నాడు వరల్డ్ నెంబర్ మూడో స్టార్ ఆటగాడు ఫెదరర్.

చిత్రాలు.. ముర్రే * ఫెదరర్