క్రీడాభూమి
స్టార్ అట్రాక్షన్ షరపోవా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెల్బోర్న్, జనవరి 14: రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో స్టార్ అట్రాక్షన్‌గా మారింది. ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ, తాను ఉత్ప్రేరకాలను వాడింది నిజమేనని ప్రకటించి ఆమె గతంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా సస్పెన్‌కు గురైన ఆమెకు గురైంది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత మళ్లీ కెరీర్‌ను కొనసాగిస్తున్న షరపోవా చెప్పుకోదగ్గ రీతిలో రాణించడం లేదు. అయితే, ఆమె రాకనే టోర్నీకి అందం తెచ్చిందని నిర్వాహకులు సంబరపడుతున్నారు. షరపోవాను చూసేందుకే ప్రేక్షకులు పోటెత్తుతారన్నది వాస్తవం. అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న ఆమె మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో క్వాలిఫయర్ హారిట్ డార్ట్‌ను 6-0, 6-0 తేడాతో చిత్తుచేసి, అభిమానులను అలరించింది.
కాగా, ప్రపంచ రెండో ర్యాంకర్ ఏంజెలిక్ కెర్బర్ 6-2, 6-2 స్కోరుతో పొలొనా హెర్కాగ్‌పై గెలుపొందింది. మూడో ర్యాంక్ క్రీడాకారిణి కరోలినా వొజ్నియాకి 6-3, 6-4 ఆధిక్యంతో అలీసన్ వాన్ ఉవాన్క్‌పై విజయం సాధించింది. డానియేల్ కొలిన్స్ 2-6, 7-6, 6-4 తేడాతో 14వ ర్యాంకర్ జూలియా జార్జస్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. 15వ ర్యాంకర్ అష్లే బార్టీ 6-2, 6-2 తేడాతో లుక్సికా కుమ్‌కుమ్‌ను, మరియా సకారీ 6-1, 3-6, 6-2 ఆధిక్యంతో 22వ ర్యాంక్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెన్కోను ఓడించి శుభారంభం చేశారు.