క్రీడాభూమి

తొలి రౌండ్‌లోనే ముర్రే ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 14: బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ ప్రస్థానం ముగిసింది. ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత తాను మేజర్ టోర్నీల్లో పోటీపడబోనని ప్రకటించిన అతను తొలి రౌండ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించాడు. సోమవారం జరిగిన ఓ మారథాన్ మ్యాచ్‌లో 22వ ర్యాంక్ ఆటగాడు రాబర్టో బటిస్టా అగుట్ 6-4, 6-4, 6-7, 6-7, 6-2 తేడాతో ముర్రేపై విజయం సాధించాడు. మొదటి రెండు సెట్లను చేజార్చుకున్నప్పటికీ, ఆతర్వాత నిలదొక్కుకొని, తుది వరకూ పోరాటం కొనసాగించి రెండు సెట్లను ముర్రే తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, అప్పటికే పూర్తిగా అలసిపోయిన అతను కీలకమైన చివరి సెట్‌లో అదే స్థాయిలో పోటీని ఇవ్వలేకపోయాడు. ఫలితంగా 2-6 తేడాతో దానిని కోల్పోయి, టోర్నీ నుంచి నిష్క్రమించాడు.