క్రీడాభూమి

అంకిత రైనాకు సింగపూర్ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా సింగపూర్‌లో జరుగుతున్న 25,000 డాలర్ల మహిళల సింగిల్స్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఈ ఏడాది తొలిసారిగా టైటిల్‌ను దక్కించుకుంది. తన కెరీర్‌లో ఇప్పటికే ఏడుసార్లు వివిధ టైటిళ్లను కైవసం చేసుకున్న అంకిత రైనా ఆదివారం జరిగిన పోటీలో టాప్ సీడ్ అరంట్‌క్సా రస్‌పై విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్ క్వాలిఫయర్ పోటీలో నిరాశ చెందినా, సింగపూర్ టోర్నీలో పాల్గొన్న అంకిత ఒక గంట 23 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ 122, డచ్ టాప్ సీడ్‌ను 6-3, 6-2 తేడాతో ఓడించింది. అంతకుముందు నలుగురు సీడెడ్ ఆటగాళ్లపై సైతం అంకిత పైచేయి సాధించింది. సింగపూర్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా అంకిత తన ఖాతాలో 50 పాయింట్లు జమ చేసుకుని సింగిల్స్‌లో 168 ర్యాంక్ దక్కించుకుంది.
చిత్రం..సింగపూర్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో టైటిల్‌ను దక్కించుకున్న
భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా