క్రీడాభూమి

సిమోనా హాలెప్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్‌లో ఏడోరోజు సోమవారం మహిళల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ కోసం జరిగిన నాలుగో రౌండ్‌లో ప్రపంచ నెంబర్ వన్ స్టార్, రొమేనియా క్రీడాకారిణి సిమోనా హాలెప్‌కు గట్టి షాక్ తగిలింది. అమెరికా నల్లకలువ, వరల్డ్ నెంబర్ 16 సెరెనా విలియమ్స్ చేతిలో 6-1, 4-6, 6-4 తేడాతో హాలెప్ పరాజయాన్ని ఎదుర్కొంది. మూడు సెట్ల మ్యాచ్‌లో కేవలం రెండో సెట్‌లో మాత్రమే ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన రొమేనియా స్టార్ చివరకు ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో క్వార్టర్ ఫైనల్స్‌లో చోటుదక్కించుకోకుండానే తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే 23సార్లు గ్రాండ్ శ్లామ్ విజేతగా నిలిచిన 37 ఏళ్ల అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ ఏడో సీడ్ కరొలినా ప్లిస్కొవాను ఢీకొంటుంది. మహిళల టాప్ సీడ్ సిమోనా హాలెప్, డిఫెండింగ్ చాంపియన్ కరొలినా వొజ్నియాకీ, ప్రపంచ రెండో సీడ్ ఏంజెలిక్యు కెర్బర్ ఆస్ట్రేలియా ఓపెన్ బరి నుంచి నిష్క్రమించడంతో ఇప్పటికే ఏడుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ కిరీటాన్ని అందుకున్న సెరెనా విలియమ్స్ మరోసారి తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గర్భం దాల్చడంతో గత ఏడాది కాలంగా గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్‌లకు దూరంగా ఉన్న సెరెనా విలియమ్స్ ఈసారి ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్‌లో గెలుపు కోసం గట్టి నమ్మకంతో తొలిదశ నుంచే పోరాడుతోంది. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు కోసం జరిగిన మరో పోటీలో ప్రపంచ నెంబర్ 4 క్రీడాకారిణి, యూఎస్ ఓపెన్ చాంపియన్, జపాన్‌కు చెందిన నవొమి ఒసాకా 13వ నెంబర్ క్రీడాకారిణి అనస్తాసిజా సెవస్టొవాను 4-6, 6-3, 6-4 తేడాతో ఓడించింది. ఈ పోటీలో మొదటి సెట్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన అనస్టాసిజా మిగిలిన రెండు సెట్లలో అదే దూకుడును ప్రదర్శించలేకపోయింది. మహిళల సింగిల్స్‌లో నాలుగో రౌండ్‌లో జరిగిన మరో పోటీలో వరల్డ్ నెంబర్ 6 క్రీడాకారిణి, ఉక్రెయిన్‌కు చెందిన ఎలినా స్విటొలినా 17 ర్యాంకర్ మడిసన్ కీస్‌ను 6-2, 1-6, 6-1తో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో జరిగిన మరో పోటీలో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ 7వ ర్యాంకర్ కరొలినా ప్లిస్కొవా, స్పెయిన్‌కు చెందిన 18వ ర్యాంకర్ గార్బినా మురుగుజాను 6-3, 6-1 తేడాతో ఓడించింది. రెండు సెట్లుగా జరిగిన ఈ పోరులో గార్బినా ఏకోశానా ప్రత్యర్థిని ప్రతిఘటించలేకపోయింది. ఇక పురుషుల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్‌లో జరిగిన పోరులో వరల్డ్ నెంబర్ 1 స్టార్ ఆటగాడు, సెర్బియాకు చెందిన నవొక్ జొకోవిచ్‌కు ఎదురులేకుండా పోయింది. క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు కోసం జరిగిన పోరులో జొకోవిచ్ తన సమీప ప్రత్యర్థి, 15వ సీడ్ డేనిల్ మెడ్వదెవ్‌ను 6-4, 6-8 (5-7), 6-2, 6-3 తేడాతో ఓడించాడు. ఇప్పటికే 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను తన ఖాతాలో జమ చేసుకున్న జొకోవిచ్ ఆరుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్, నాలుగుసార్లు వింబుల్డన్ టైటిళ్లను అందుకున్నాడు. 2016లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా ఆవిర్భవించాడు. ఇపుడు ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌పై గట్టి నమ్మకంతో ఉన్నాడు. పురుషుల సింగిల్స్‌లో జరిగిన మరో పోటీలో ప్రపంచ నెంబర్ 4 ఆటగాడు, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ వరల్డ్ నెంబర్ 16 మిలొస్ రవొనిక్ చేతిలో 6-1, 6-1, 7-6 (7-5) తేడాతో ఓటమి చెందాడు. మొదటి రెండు సెట్లలో ఏమాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయినా జ్వెరెవ్ మూడో సెట్‌లో పైచేయి సాధించాలని గట్టిగా ప్రయత్నించి సఫలమైనా నాలుగో రౌండ్‌తోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన ప్రపంచ నెంబర్ 8వ క్రీడాకారుడు కీ నిషికొరి 23వ ర్యాంకర్ పాబ్లొ కరెనొ బుస్టాను 6-7 (8-10, 4-6, 7-6 (7-4), 6-4, 7-6 (10-8) తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లో చోటుదక్కించుకున్నాడు.

చిత్రాలు.. విజేతలు *సెరెనా విలియమ్స్ *నవోక్ జొకోవిచ్ *నవొమి ఒసాకా