క్రీడాభూమి

మాడ్రిడ్ ఓపెన్ విజేత జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 9: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ గెల్చుకున్నాడు. ఫైనల్‌లో ఆండీ ముర్రేను 6-2, 3-6, 6-3 తేడాతో విజయం సాధించి, కెరీర్‌లో 29వ మాస్టర్స్ టైటిల్‌ను అందుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముర్రే గట్టిపోటీనిచ్చాడు. వరుసగా 12వ మాస్టర్స్ విజయంపై కనే్నశాడు. అయితే, అతను విసిరిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్న జొకోవిచ్ ఐదు బ్రేక్ పాయింట్లను నిలబెట్టుకున్నాడు. 2014 నుంచి ముర్రేపై 13 మ్యాచ్‌లు ఆడిన జొకోవిచ్ 12వ విజయాన్ని నమోదు చేయడం విశేషం. మాడ్రిడ్‌లో అతనికి ఇది రెండో టైటిల్. ఈ ఏడాది ఐదోది. ఈ సీజన్‌లో 33వ విజయాన్ని సాధించిన అతను అత్యధిక విజయాల జాబితాలో జాన్ బోర్గ్, పీట్ సంప్రాస్ సరసన ఆరో స్థానంలో నిలిచాడు. అంతేగాక, గత ఆరు మాస్టర్స్ టైటిళ్లలో ఐదింటిని ఖాతాలో వేసుకొని తనకు తిరుగులేదని నిరూపించాడు.