క్రీడాభూమి

భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: ప్రస్తుత భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని భారత జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. విశాఖ గీతం డీమ్డ్ యూనివర్శిటీలో క్రికెట్ మైదానాన్ని మంగళవారం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఏడు దశాబ్దాల తరువాత పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును వారి గడ్డపైనే ఓడించడం సాధారమైన అంశమేమీ కాదన్నారు. రానున్న ప్రపంచ కప్ పోటీలకు ఒకటి, రెండు మార్పులు మినహా ఇదే జట్టు బరిలో దిగే అవకాశం ఉందన్నారు. 1983లో కపిల్‌దేవ్ నేతృత్వంలో యువ, సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టు అద్భుత విజయాన్ని సాధించిందని, ప్రస్తుతం విరాట్ కోహ్లీ సారధ్యంలో భారత జట్టు అదే కూర్పుతో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోందన్నారు. భారత జట్టును ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీలో నిర్మించిన క్రికెట్ మైదానం దేశంలో తాను చూసిన క్రికెట్ మైదానాల్లోనే అత్యుత్తమమైనదిగా పేర్కొన్నారు. ఈ మైదానంలో కీలక పోటీల నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో గీతం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భరత్, గీతం ఇన్‌ఛార్జి వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ, గీతం కార్యదర్వి బీవీ మోహన రావు, సంయుక్త కార్యదర్శి ఎం భరద్వాజ్, శాప్ చైర్మన్ పీ అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రికెట్ మైదానంలో తొలి సారి జరుగుతున్న క్రికెట్ పోటీలను సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే, గీతం అధ్యక్షుడు శ్రీ భరత్ ప్రారంభించారు.

చిత్రం.. గీతం క్రికెట్ మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్