క్రీడాభూమి

ప్రయోగాలకు పదును!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచకప్ ముందు భారత జట్టు ప్రయోగాలకు పదును పెట్టనుంది. ఇప్పటికే జట్టు 14 మంది సభ్యులను ఎంపిక చేశామని, 15వ ఆటగాడి విషయంలో ఒక్క మార్పు మినహా జట్టులో మార్పులేమీ ఉండవని చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయతే దీనికి ముందు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టీ20, వనే్డ సిరీస్‌లో భారత జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రోహిత్‌కు విశ్రాంతి..
సుదీర్ఘ క్రికెట్ ఆడుతున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు విశ్రాంతి కల్పించనున్నట్లు సెలక్టర్లు భావిస్తున్నారు. గత న్యూజిలాండ్ పర్యటనలో వనే్డ సిరీస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చివరి రెండు మ్యాచ్‌లు, టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. అయతే ఆస్ట్రేలియా గత పర్యటనలో పేసర్ జస్ప్రీత్ బూమ్రాకు సైతం సెలక్టర్లు విశ్రాంతిని కల్పించారు. రోహిత్‌తో పాటు స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ , పేసర్ మహమ్మద్ షమీలకు కూడా విశ్రాంతి కల్పించాలనే ఆలోచన చేస్తున్నారు. అయతే రోహిత్ స్థానంలో గతంలో కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై వివాస్పద వ్యాఖ్యలు చేసి బషిష్కరణకు గురైన కేఎల్ రాహుల్‌ను ఆడించనున్నట్లు సమాచారం. అయతే న్యూజిలాండ్ పర్యటనలో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ కోహ్లీ, బౌలర్ బూమ్రా ఈ సిరీస్‌లో పాల్గొననున్నారు.
పక్కా ప్రణాళికతో..
మేలో జరిగే ప్రపంచ కప్‌కు పక్కా ప్రణాళికతో తుది జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు బ్యాటింగ్ ఆర్డర్లలోనూ ప్రయోగం చేయనున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా, అంబటి రాయుడుని నాలుగో స్థానంలో, గత న్యూజిలాండ్ పర్యటనలో విజయ్ శంకర్‌ని మూడో స్థానంలో ఆడించారు. దీంతో సెలక్టర్లు పక్కా ప్రణాళికతో ప్రపంచకప్‌కు తుది జట్టును ఎంపిక చేయనున్నారనే విషయం స్పష్టమవుతోంది.
అందరూ బాగానే ఆడుతున్నారు..
ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ జట్టులో ఇటీవల చేరిన కొత్త కుర్రాళ్లు అందరూ బాగా ఆడుతున్నారని పేర్కొన్నాడు. అయతే ఇదే సమావేశంలో రిషభ్‌పంత్, విజయ్ శంకర్, అంబటి రాయు డు, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్‌ల పేర్లు కూడా ప్రపంచకప్ ప్రాబబుల్స్ జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ప్రయోగంలో భాగంగానే విజయ్ శంకర్‌ను మూడో స్థానంలో, రాయుడితో ఓపెనింగ్ చేయంచాలనే ఆలోచనలో టీమిండియా సెలక్షన్ కమిటీ యోచిస్తోంది.
ధోనీ విషయంలో స్పష్టత..
ఎప్పటినుంచో ధోనీ విషయంలో స్పష్టతనిస్తూ వస్తున్న పలువురు అభిమానులు ఈ ప్రపంచకప్‌లో ధోనీ ఆడడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎంఎస్‌కే ప్రసాద్ మాట్లల్లో మాత్రం ధోనీ తప్పకుండా జట్టులో ఉంటాడని స్పష్టం చేసినట్లయంది. ధోని జట్టులో ఉంటే బ్యాటింగ్, వికెట్ కీపింగ్ తో పాటు ఆటగాళ్లకు సలహాలివ్వడంతో అతడిని మించినవాడు లేడని కొనియాడాడు. ఇక మిడిలార్డర్ ధోనితో పాటు చోటు దక్కితే రిషభ్‌పంత్, అంబటిరాయుడు, హార్దిక్ పాండ్య, ఆల్ రౌండర్ కుల్దీప్ యాదవ్‌తో ప్రత్యర్థి జట్లకు బలంగా కనిపించనుంది. ఏదేమైనా ఆస్ట్రేలియాతో జరిగే ఈ సిరీస్ ప్రపంచకప్ ముందు టీమిండియా ప్రయోగాలకు వేదిక కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.