క్రీడాభూమి

అనూజ్‌పై జీవితకాల నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: అండర్ -23 జట్టులో తనను ఎంపిక చేయలేదనే కక్షతో టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ సీనియర్ జట్టు చీఫ్ సెలెక్టర్ అమిత్ భండారీపై దాడికి పాల్పడిన యువ క్రికెటర్ అనూజ్ దెడాపై జీవిత కాల నిషేధం విధించేందుకు ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) సిద్ధమైంది. అనూజ్ భవిష్యత్తులో క్రికెట్ ఆడకుండా అతడిపై జీవితకాల నిషేధం విధించా లని నిర్ణయంచినట్లు డీసీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ ప్రకటించారు. రజత్ శర్మ మాట్లాడుతూ అనూజ్‌పై జీవితకాల నిషేధం విధించడమే సరైన చర్య. దాడి ఘటన పై మాత్రమే విచారణ జరుగుతోంది. అలాగే కొందరు ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేస్తారంటూ సెలెక్టర్లపైనా ఫిర్యాదులు అందుతున్నాయ, వీటిపైనా విచారణ జరిపి చర్యలు చేపడతామని తెలిపారు. అనూజ్‌ను క్రికెట్ ఆడకుండా నిషేధించాలని ఇప్పటికే ఈ ఘటనపై భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ స్పందించిన విషయం తెలిసిందే. అనూజ్ తన సోదరుడు హరీష్ మరికొందరితో కలిసి భండారీ ఇనుప రాడ్లు, హాకీ స్టిక్కులతో దాడి చేసిన విషయం తెలిసిందే.

చిత్రం.. అనూజ్. తన స్నేహితుల చేతిలో గాయపడ్డ ఢిల్లీ సినీయర్ జట్టు చీఫ్ సెలక్టర్ అమిత్ భండారీ