క్రీడాభూమి

బిసిసిఐ అధ్యక్ష పదవికి మనోహర్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 10: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా కూడా సేవలు అందిస్తున్న అతను వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐసిసి చైర్మన్ పదవికి మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనుండగా ఆ పదవిని మరోసారి దక్కించుకోవడానికి వీలుగా శశాంక్ బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగాడు. స్వతంత్ర అభ్యర్థిని ఐసిసి చైర్మన్‌గా ఎన్నుకోవాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక, ఆ పదవికి ఎన్నికయ్యే వ్యక్తి మరే ఇతర క్రీడా సంఘాలు లేదా సమాఖ్యల కార్యవర్గంలో ఉండరాదు. చైర్మన్ పదవికి రేసులో ఉన్న మనోహర్ ఈ నిబంధనను దృష్టిలో ఉంచుకొని బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు.
తర్వాత ఎవరు?
మనోహర్ తర్వాత బిసిసిఐ అధ్యక్ష పదవిని ఎవరు చేపడతారన్నది ఉత్కంఠ రేపుతోంది. బోర్డు ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా రేసులో ఉన్నట్టు సమాచారం. లాయర్‌గా ఖ్యాతిని ఆర్జించి, తర్వాతి కాలంలో క్రికెట్ అడ్మినిస్ట్రేర్‌గా ఎదిగిన మనోహర్ బిసిసిఐ అధ్యక్షుడిగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. జగ్మోహన్ దాల్మియా గుండెపోటుతో మృతి చెందడంతో, బోర్డు అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యంకాగా, పలు నాటకీయ పరిణామాల అనంతరం మనోహర్ అధికార పగ్గాలను చేపట్టాడు. అంతకు ముందు కూడా బోర్డు అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం అతనికి ఉంది. 2008-2011 మధ్యకాలంలో ఇదే హోదాలో సేవలు అందించిన మనోహర్‌ను రెండోసారి ఆ పదవి వరించింది. పాలనాదక్షుడిగా పేరు సంపాదించాడు కాబట్టే అతనికి ఈ పదవి మరోసారి దక్కింది. బోర్డు కష్టాల్లో ఉన్నప్పుడు మొదటిసారి అతను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. రెండోసారి కూడా బోర్డు వివిదాల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన తరుణంలో అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించడం గమనార్హం. బోర్డుపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే, పలు కేసులు చుట్టుముట్టి వేధిస్తుండడంతో అతను వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. అయతే, అతను వేసిన పునాది బిసిసిఐ అభివృద్ధికి ఉపయోగడపడడం ఖాయం.
ప్రక్షాళనపై దృష్టి
బిసిసిఐ ప్రక్షాళనపైనే మనోహర్ దృష్టి కేంద్రీకరించాడు. అదే తన ముందున్న తక్షణ కర్తవ్యమని అధ్యక్షుడిగా ఎన్నకైన వెంటనే మనోహర్ ప్రకటించాడు. ఆటగాళ్లు, అధికారులకు పరస్పర ప్రయోజనాలు చేకూర్చే అంశాలను పరిశీలించడానికి ప్రత్యేక అధికారిని నియమించడంతో అతని సంస్కరణల పర్వం మొదలైంది. బోర్డు రూపురేఖలను మార్చే ప్రక్రియ మొదలైందని, ఈ దిశగా తీసుకున్న అనేక నిర్ణయాలను దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించిన అతను తన హామీని నిలబెట్టుకునే దిశగా తీసుకున్న చర్యల్లో సుందర్ రామన్‌తో రాజీనామా చేయించడం ఒకటి. 2017 వరకూ పదవిలో ఉంటాడు కాబట్టి, ఈలోగా మనోహర్ బోర్డుకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాడని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. కానీ, ఐసిసి చైర్మన్ పదవి కోసం అతను బిసిసిఐ అధ్యక్ష పదవిని విడిచిపెట్టాడు.