క్రీడాభూమి

అభినందన్‌కు గోల్డ్‌మెడల్ అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: భారత రెజ్లర్ బజరంగ్ పూనియా బల్గేరియాలోని రూసేలో జరిగిన డాన్ కొలొవ్-నికొలా పెట్రా టోర్నమెంట్‌లో సాధించిన గోల్డ్‌మెడల్‌ను పాక్ కబంధ హస్తాల నుంచి విముక్తుడైన ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ పతకం విజేత అయిన బజరంగ్ పూనియా 65 కేజీల ఫ్రీస్టయిల్ ఫైనల్‌లో జరిగిన పోటీలో గోల్డ్‌మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘నేను సాధించిన గోల్డ్‌మెడల్‌ను భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు అంకితం ఇస్తున్నాను. ఆయన స్ఫూర్తితోనే ఈ ఘనత సాధించాను. ఆయనను ఏదో ఒకరోజు స్వయంగా కలుసుకుని షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకుంటున్నాను’ అని పూనియా తన విజయం తర్వాత ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు.