క్రీడాభూమి

సింధు మరో‘సారీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్ హోమ్, మార్చి 6: గతేడాది సెమీ ఫైనల్ వరకు వెళ్లిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, ఈ సారి ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ మొదటి రౌండ్‌లోనే ఓటమి చెందిం ది. బుధవారం బర్మింగ్ హోమ్ వేది కగా జరిగిన ఈ టోర్నీలో సింధు దక్షి ణ కొరియా క్రీడాకారిణి సుంగ్ జి హ్యున్‌తో తలపడి 16-21, 22-20, 18-21తో పరాజయం పాలైంది. మొ దట సింధు 6-3 తేడాతో మ్యాచ్‌ను బాగానే ప్రారంభించినా, బ్రేక్‌కు ముందు 11-8 ఆధిక్యంతో సుంగ్‌జీ దూసుకెళ్లింది. ఆ తర్వాత అటాకింగ్ గేమ్‌తో 21-16తో మొదటి గేమ్‌ను సింధుపై సులువుగా నెగ్గింది. రెండో గేమ్‌లో గట్టి పోటినిచ్చిన సింధు 22-20తో నెగ్గింది. ఇక చివరి గేమ్‌లో సుంగ్‌జీ తెలివిగా ఆడి 21-18తో సు నాయాసంగా విజయం సాధించింది. సుంగ్ జిపై సింధు ఓడిపోవడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన హాం కాంగ్ ఓపెన్‌లోనూ సుంగ్‌జి సింధు ని ఓడించింది. ఓవరాల్‌గా వీరిద్దరూ 14 మ్యాచ్‌ల్లో తలపడగా సింధు ఎనిమిదింట్లో, సుంగ్‌జీ ఆరింట్లో గెలిచారు.