క్రీడాభూమి

మార్పుల్లేకుండానే..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 7: ఆస్ట్రేలియాతో ఉత్కంఠగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించగా, నేడు రాంచీలో జరిగే మూడో వనే్డ లోనూ గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా తహతహలాడుతోంది. ఇప్పటికే టీమిండియా ఐదు వనే్డల మ్యాచ్ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు సిరీస్ కో ల్పోకూడదంటే ఆస్ట్రేలియా నేడు జరగబోయే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది.
గత మ్యాచ్ జట్టుతోనే
గత మ్యాచుల్లో ఆడిన ఆటగాళ్లతోనే ఇరు జట్లు నేడు రాంచీలో జరిగే మ్యాచ్‌లో బరిలో దిగనున్నాయ. అయతే ఆడిన రెండు మ్యాచు ల్లో అంబటి రాయుడు విఫలం కావడంతో అత డి స్థానంలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయ. ప్రపంచ కప్‌కు ముందు రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ను తప్పించే అవకాశలేక పోవడంతో తుది జట్టులో రాయుడికి అవకాశం కష్టంగా మారవచ్చు.
భారీ స్కోర్లు ఏవీ..
ఇప్పటివరకు జరిగిన రెండు వనే్డల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోర్లేమీ చేయలేదు. అయతే బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారనుకున్నా ప్రపంచకప్‌కు ముందు ఇరు జట్ల బ్యాట్స్‌మెన్లపై ఈ ప్రభావం పడనుంది. ఉప్పల్‌లో జరిగిన మొదటి వనే్డలో మొదటగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడి 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు మాత్రమే చేసింది. అయతే లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 10 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కో ల్పోయ విజయం సాధించింది. ఇక నాగపూర్ వేదికగా జరిగిన రెండో వనే్డలో ముందు బ్యా టింగ్‌కు దిగిన భారత్ పూర్తి ఓవర్లు ఆడినా 250 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కంగారూలు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 242 పరుగులకే చాపచుట్టేశారు.
ఒకరిద్దరూ మాత్రమే..
వనే్డ సిరీస్‌లో గమనించదగ్గ విషయమేమి టంటే ఇరు జట్లలో ఎవరో ఒకరిద్దరూ బ్యా ట్స్‌మెన్లు మినహా మిగతా అందరూ విఫల మవుతున్నారు. మొదటి వనే్డలో భారత్ తరఫున మహేంద్రసింగ్ ధోనీ, కేదార్ జాదవ్ రాణిం చగా, ఆసీస్ తరఫున ఉస్మాన్ ఖాజా, గ్లేన్ మ్యా క్స్‌వెల్ రాణించారు. రెండే వనే్డలో భారత్ తర ఫున కెప్టెన్ విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్ రా ణించగా, ఆస్ట్రేలియా తరఫున మార్కస్ స్టొ యనిస్, పీటర్ హాండ్స్‌కాంబ్‌లు మాత్రమే టా ప్ స్కోరర్లుగా నిలిచారు. మరోవైపు ఇరు జట్ల లో టాప్ ఆర్డర్ విఫలం కావడం ఇటు జట్టు మేనేజ్‌మెంట్లను ఆందోళన కలిగిస్తోంది. ప్రపం చకప్‌కు ముందు ఇదే చివరి సిరీస్ కావడంతో బ్యాట్స్‌మెన్లు మిగతా మ్యాచుల్లోనైనా ఫాంలో కి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ నుంచి ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోనీలు పూర్తిస్థాయ ప్రదర్శన కనబరచకపోగా, ప్రత్యర్థి జట్టు నుంచి కెప్టెన్ ఆరోన్ ఫించ్, షాన్ మార్ష్, గ్లేన్ మ్యాక్ సవెల్ ఫాంలో లేకపోవడం ఆ జట్టును వేధిస్తోంది.
పూర్తిగా బౌలింగ్ పిచ్
రాంచీ మైదానం పూర్తిగా బౌలింగ్ పిచ్ కా వడంతో ఇక్కడా పెద్దగా భారీ స్కోర్లు చేసే అవ కాశం తక్కువే. 2013లో ఇరు జట్లు ఇక్కడ తల పడగా వర్షం కారణంతో మ్యాచ్ రద్దయంది. ఓ వరాల్ భారత్ ఈ మైదానంలో నాలుగు మ్యా చ్‌లాడగా, రెండింట విజయం సాధించింది. ఒ క మ్యాచ్ రద్దవగా, చివరగా 2016లో న్యూజి లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయంది.

చిత్రాలు.. రాంచీ మైదానంలోని ఎంఎస్ ధోనీ పెవిలియన్
*నెట్ ప్రాక్టీస్‌లో మహేంద్రసింగ్ ధోనీ