క్రీడాభూమి

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మార్చి 12: న్యూజిలాం డ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కాను న్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ విలి యమ్సన్ గాయపడ్డాడు. దీంతో మై దానంలోనే విలవిల్లాడిన కీవిస్ కెప్టెన్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విలియమ్సన్‌ను పరిశీలించిన వైద్యు లు స్కానింగ్ చేసిన తర్వాత కొద్ది రో జులు విశ్రాంతి అవసరమని చెప్పా రు. దీంతో శనివారం నుంచి జరిగే మూడో టెస్టుకు విలియమ్సన్ దూ రం కానున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
సన్‌రైజర్స్ కెప్టెన్‌గా..
మరోవైపు విలియమ్సన్ గాయ పడడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టోర్నీ ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయంది. గతేడాది కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంప రింగ్ వివాదంతో వైదోలగగా, విలి యమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు జట్టును ఫైనల్‌కు తీసు కెళ్లాడు. అయతే విలియమ్సన్ గాయ పడడం, వార్నర్‌పై నిషేధం ముగియ డంతో ఈ సీజన్‌లో కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది తెలియాల్సి ఉంది.