క్రీడాభూమి

ఇండియన్ వెల్స్ టెన్నిస్ సెమీస్‌లో బెలిండాతో కెర్బర్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్‌వెల్స్, మార్చి 15: ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరేందుకు ఏంజెలిక్ కెర్బర్, బెలిండా బన్సిక్ ఢీ కొంటారు. అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో కెర్బర్ 7-6, 6-3 తేడాతో ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్‌ను నేరు సెట్లలో ఓడించి సెమీస్ చేరింది. బెలిండా 6-3, 4-6, 6-3 ఆధిక్యంతో కరోలినా ప్లిస్కోవాపై విజయం సాధించి, సెమీస్‌లో చోటు సంపాదించింది. కాగా, చివరి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బియాన్కా ఆండ్రెస్క్యూ, ఎలినా స్విటోలినా తలపడతారు. క్వార్టర్స్‌లో ఆండ్రెస్క్యూ 6-0, 6-1 స్కోరుతో గార్బెనె ముగురుజాను చిత్తుచేసింది. ప్రత్యర్థి నుంచి ఆమెకు ఏ దశలోనూ గట్టిపోటీ ఎదురుకాలేదు. మరో మ్యాచ్‌లో స్విటోలినా 4-6, 6-4, 6-4 తేడాతో మార్కెటా వాన్‌డ్రూసొవాపై గెలుపొందింది. తొలి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ, మిగతా రెండు సెట్లలో స్విటోలినా అద్భుత పోరాట పటిమను కనబరచింది. పురుషుల సింగిల్స్‌లో మిలోస్ రోనిక్ సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను మియోమిర్ కెమనోవిచ్‌పై 6-3, 6-4 తేడాతో గెలుపొందాడు. కాగా, ప్రత్యర్థి డామినిక్ థియేమ్ కండరాల నొప్పి కారణంగా పోటీ నుంచి వైదొలగడంతో, గేల్ మోన్ఫిల్ సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నాడు.