క్రీడాభూమి

కొత్తేమీకాదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: క్రీడాకారులు లేదా జట్లపై దాడులు జరగడం కొత్తేం కాదు. మ్యూనిచ్ ఒలింపిక్స్ నుంచి తాజాగా క్రైస్ట్‌చర్చిలో కాల్పుల వరకూ ఎన్నో సంఘటనలు క్రీడా రంగాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్లు ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకోవడం ఊరటనిస్తున్నా, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో జరిగిన ఊచకోతను మాత్రం ఇంకా ఎవరూ మరచిపోలేదు. పదకొండు మంది ఇజ్రాయిల్ అథ్లెట్లు, కోచ్‌లను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఆతర్వాత వారిని కాల్చి చంపారు. అప్పటి పశ్చిమ జర్మనీకి చెందిన ఒక పోలీస్ అధికారిని కూడా ఉగ్రవాదులు హతమార్చారు. 1987లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు శ్రీలంకలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పర్యటించింది. మొదటి టెస్టు ముగిసిన తర్వాత, కొలంబోలో చోటు చేసుకున్న బాంబు పేలుడు సంఘటనలో 113 మంది పౌరులు మృతి చెందారు. ఈ సంఘటన క్రికెటర్లు బస చేసిన హోటల్ సమీపంలోనే చోటు చేసుకోవడంతో, మిగతా రెండు టెస్టులను రద్దు చేసుకొని కివీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోయింది. 2002లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించినప్పుడు, ఆటగాళ్లు బస చేసిన హోటల్ ఆవరణలోనే బాంబు పేలింది. ఆ సంఘటనలో 12 మంది పౌరులు మృతి చెందారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెంటనే తన జట్టును స్వదేశానికి పిలిపించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పాకిస్తాన్‌లో న్యూజిలాండ్ ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లోనూ ఆడలేదు. అంతకు ముందు ఏడాదే న్యూజిలాండ్ క్రీడాకారుల బృందం పాకిస్తాన్‌కు వెళుతున్న సమయంలోనే, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాద దాడి జరిగింది. ఫలితంగా ఆ పర్యటన మొదలుకాకుండానే ముగిసింది. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టు లాహోర్‌లో రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట కోసం గడాఫీ స్టేడియానికి వెళుతున్న సమయంలో, వారు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ సంఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, శ్రీలంక ఆటగాళ్లలో ఆరుగురు గాయపడ్డారు. ఆటగాళ్లను రక్షించే ప్రయత్నంలో ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పౌరులు కూడా బెలట్ గాయాలతో మృతి చెందారు. టూర్‌ను రద్దు చేసుకున్న శ్రీలంక క్రికెటర్లు ప్రత్యేక విమానంలో స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ సంఘటన తర్వాత ప్రపంచ దేశాలేవీ పాక్‌లో క్రికెట్ మ్యాచ్‌లు, సిరీస్‌లు ఆడేందుకు వెళ్లలేదు. ఇప్పటికీ పాకిస్తాన్ తన సిరీస్‌లు, టోర్నీలను తటస్థ వేదికైన దుబాయ్‌లోనే ఆడుతున్నది. 2010లో జరిగిన ఆఫ్రికన్ నేషన్స్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు టాగో జాతీయ ఫుట్‌బాల్ జట్టు వెళ్లింది. కాబిండాలోని అంగోలాన్ ప్రావిన్స్ వద్ద ఈ జట్టు ప్రయాణిస్తున్న వాహనంపై వేర్పాటు వాదులు కాల్పులు జరిపారు. ఆ సంఘటనలో జట్టు అసిస్టెంట్ మేనేజర్, మీడియా ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. తాజా సంఘటనలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ప్రార్థన కోసం మసీదుకు వెళ్లినప్పుడు ఆగంతకుడు కాల్పులకు దిగాడు. అదృష్టవశాత్తు బంగ్లా క్రికెటర్లు క్షేమంగా బయటపడ్డారు.