క్రీడాభూమి

ఓడి గెలిచిన చెనె్నయన్ ఐఎస్‌ఎల్ ఫైనల్‌లో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 16: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో చెనె్నయన్ అత్యంత నాటకీయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. లెమెస్సా ఫిక్రూ కీలకమైన గోల్‌చేసి చెనె్నయన్‌ను పైనల్ చేర్చాడు. బుధవారం జరిగిన రెండో సెమీ ఫైనల్ సెకండ్ లెగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాను ఢీకొన్న ఈ జట్టు 1-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. అంతకు ముందు, ఇదే జట్టుతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మొదటి లెగ్‌లో ఈ జట్టు 3-0 తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. దీనితో రెండో లెగ్ సెమీ ఫైనల్‌లో గోల్స్ తేడా భారీగా లేకపోతే ఫైనల్‌చేరే అవకాశాలున్న దశలో బరిలోకి దిగింది. కాగా, విజయమే లక్ష్యంగా పోరాడిన కోల్‌కతాకు 22వ నిమిషంలో డిజన్ లెకిక్ తొలి గోల్‌ను అందించాడు. ఆతర్వాత పోటీ తీవ్రస్థాయలో కొనసాగింది. 87వ నిమిషంలో లియాన్ హ్యూమ్ చేసిన గోల్‌తో కోల్‌కతా 2-0 ఆధిక్యానికి చేరింది. అయతే, మ్యాచ్ చివరి క్షణాల్లో ఫిక్రూ చేసిన గోల్‌తో కోల్‌కతా ఆధిక్యం 2-1కి తగ్గింది. ఈ ఆధ్యంతోనే కోల్‌కతా గెలిచినప్పటికీ, మొదటి లెగ్ ఫలితాన్ని కూడా పరిగణలోకి తీసుకొని, ఉత్తమ గోల్స్ ప్రాతిపదికన చెనె్నయన్‌ను ఫైనల్ చేరిన జట్టుగా ప్రకటించారు. ఈనెల 20న జరిగే తుదిపోరులో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌తో చెనె్నయన్ ఢీ కొంటుంది. ఓడినప్పటికీ ఈ జట్టు ఫైనల్‌లోకి అడుగుపెట్టగా, డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా గెలిచినా ఫలితం లేకపోయంది.