క్రీడాభూమి

టెన్షన్.. టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: నేడు భారత్ ప్రపంచకప్ జట్టులో పాల్గొనే 15మందితో కూడిన జాబితాను ముంబైలో ప్రకటించనుంది. ఈ నెల 23వరకు సమ యం ఉన్నా, బీసీసీఐ ఎనిమిది రోజుల ముందే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వం లోని సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జట్టు ను ప్రకటించనుంది. ఐపీఎల్‌కు ముం దే ప్రపంచకప్ జట్టుపై ఓ అవగాహ నకు వచ్చామని చీఫ్ సెలక్టర్ ఎమ్మె స్కే ప్రసాద్‌తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పలు సందర్భాల్లో చెప్పి న విషయం తెలిసిందే. అయతే జట్టులో నాలుగో స్థానం, మూడో ఓపెనర్, రెండో వికెట్ కీపర్, నాలుగో సీమర్‌పై కొద్దిరోజులుగా కసరత్తు జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా నాలుగో స్థానంపై సందిగ్ధం నెలకొంది. నేటి జట్టు ప్రకటనతో అది ఎవరితో భర్తీ చేయస్తారనే ఊహాగానాలకు తెరపడనుంది.
ఆ స్థానం ఎవరిని వరించేనో..?
థర్డ్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ చోటు దాదాపు ఖాయ మైనట్టే. అయి తే గత కొద్ది రోజులుగా భారత జట్టులో నాలుగో స్థానాన్ని పూర్తిస్థాయలో భర్తీ చేసేందుకు సెలక్షన్ కమిటీ పలువురి ఆటతీరును పరిశీలించింది. ఇందులో ముఖ్యంగా సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ను తీసుకొస్తే బ్యాకప్ కీపర్‌తో పాటు అదనంగా బ్యాట్స్ మన్ దొరికినట్టేనని విశే్లషిస్తున్నారు. అయతే ఇక్కడ కార్తీక్ కు ప్రత్యామ్నాయంగా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను కూడా మరికొందరు సమర్థిస్తున్నారు. ఇటీవల రిషభ్ చేసి న ప్రదర్శన చూడాలని సూచిస్తున్నారు. ఇంకొందరైతే అం బటి రాయుడు పేరును పరిగణలోకి తీసుకోవాలంటున్నా రు. రాయుడు గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున మంచి ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనే రాయుడు జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిందనడంలో ఎలాంటి అతిశ యోక్తి లేదు. అయితే ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో వీరంతా విఫలం కాగా, ఐపీఎల్‌లో రాహుల్ మిన హా మిగతా అందరూ చెప్పుకోదగిన ఇ న్నింగ్స్‌లేమీ ఆడలేదు. ఇదే నాలు గో స్థానం కోసం ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా వీరి కి పోటీనిస్తున్నాడు. ఇటీ వల చేసిన ప్రదర్శనలే జట్టులో చో టు కోసం అతడి పేరు పరిశీలనలో వినిపి స్తోంది.
ఎవరా బౌలర్?
నాలుగో స్థానంలో బ్యాట్స్‌మన్, రెండో వికెట్ కీపర్, ఆల్‌రౌండర్ తీసుకోకుండా సెలక్షన్ కమిటీ నాలుగో పేసర్‌కే మొగ్గు చూపితే ఎవరా నాలుగో బౌలర్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. బౌలర్లలో ఈ స్థానం కోసం సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మల పేర్లు పరిశీలనలో ఉండగా, వీరికి పోటీగా యువ బౌలర్లు ఖలీల్ అహమ్మద్, నవదీప్ సైనీ పేర్లు వినిపిస్తున్నాయ. ఇప్పటికే తుది జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లకు చోటు ఖాయమైంది.
ఐపీఎల్ ప్రదర్శనతోనేనా..?
కొద్దిరోజుల క్రితమే భారత ప్రపంచకప్ తుది జట్టును సిద్ధం చేశామని, అయతే ఒక స్థానంపై మాత్రమే స్పష్టత రాలేదని బీసీసీఐతో పాటు కెప్టెన్, కోచ్ చెప్పిన మాట తెలిసిందే. అయి తే ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన, ఐపీఎల్ రావడంతో వాటి ఆధారంగా జట్టు ఎంపిక ఉండబోదని కూడా గతంలోనే స్పష్టం చేశారు. కాగా, ఆ నాలుగో స్థానం ఎవరిది? ఏ ప్రతిపాదన జట్టులోకి ఎంపిక చేయబోతున్నారు? అనేది ప్రశ్నార్థకమే. అయి తే బీసీసీఐకి చెందిన అధికారి ఒకరు మాత్రం ఐపీఎల్ ప్రదర్శనతోనే నాలుగో స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు చెప్పడం గమనార్హం.