క్రీడాభూమి

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఏప్రిల్ 20: వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజ మాన్యం కెప్టెన్‌గా అంజిక్యా రహానే ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. రహానే స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను నియమించింది. స్మిత్ గతంలో రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురై, తిరిగి ఈ సీజన్‌తో తన పునరాగమనాన్ని చాటాడు. అయతే ఇప్పటివరకు రాజస్థాన్ ఆడిన మ్యా చుల్లో కేవలం రెండిట్లోనే విజయం సాధించడం, పాయంట్ల పట్టికలో కింది నుంచి రెండో వరుసలో నిలవడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జోస్ బట్లర్ భార్య ప్రసవించడంతో జట్టుకు దూరం కాగా, ప్రపంచకప్ నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఇంగ్లాండ్‌కే చెందిన బెన్ స్టోక్ట్ దూరం కానున్నాడు.