క్రీడాభూమి

సిక్సర్ల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ కలిపి మొత్తం 20 సిక్సర్లు బాదారు. ఇందులో కోహ్లీ 8 సిక్సర్లు కొట్టగా, డివిలియర్స్ 12 సిక్సర్లు సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్ జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది. బెంగళూరులో 2013 ఏప్రిల్ 23న పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు సూపర్ స్టార్ క్రిస్ గేల్ 66 బంతులు ఎదుర్కొని అజేయంగా 175 పరుగులు సాధించాడు. ఆ క్రమంలో అతను 13 ఫోర్లతోపాటు 17 సిక్సర్లు బాదాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున 2008 ఏప్రిల్ 18న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో బ్రెండన్ మెక్‌కలమ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 2012 మే 17న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ చెరి 13 సిక్సర్లు కొట్టారు. ఐపిఎల్‌లో అత్యధిక సిక్సర్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించారు. తాజా ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ 12 సిక్సర్లు కొట్టి, మూడో స్థానాన్ని క్రిస్ గేల్‌తో కలిసి పంచుకుంటున్నాడు. 2015 మే 6న బెంగళూరులో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ బెంగళూరు బ్యాట్స్‌మన్ 12 సిక్సర్లు సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో పది లేదా అంతకు మించి సిక్సర్లు కొట్టిన వారిలో సనత్ జయసూర్య (11), మురళీ విజయ్ (11), ఆడం గిల్‌క్రిస్ట్ (10) ఉన్నారు. మొత్తం మీద శనివారం డివిలియర్స్ డజను సిక్సర్లు బాదడం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.