క్రీడాభూమి

జొస్ బట్లర్ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, మే 12: జొస్ బట్లర్ అజేయ శతకంతో రాణించి, పాకిస్తాన్‌తో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు సాధించింది. బట్లర్ 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా మంచి ఫామ్‌ను కొనసాగించి 71 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. జాసన్ రాయ్ (87), జానీ బెయిర్‌స్టో (51) కూడా అర్ధ శతకాలను నమోదు చేయగా, జో రూట్ 40 పరుగులు సాధించాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిదీ, హసన్ అలీ, యాసిన్ షా తలా ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ చివరి వరకూ గట్టిపోటీనిచ్చింది. ఫకర్ జమాన్ 138 పరుగులు చేసి, పాక్ అభిమానుల ఆశలను సజీవంగా నిలిపాడు. బాబర్ ఆజం, అసిఫ్ అలీ చెరి 51 పరుగులు చేసి ఔటయ్యారు. అయితే, లోయర్ మిడిల్ ఆర్డర్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 361 పరుగులు చేసింది. డేవిడ్ విల్లే 57 పరుగులకు రెండు, లియాన్ ప్లంకెట్ 64 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.
చిత్రం... పాకిస్తాన్‌ను ఓడించిన ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆనందం