క్రీడాభూమి

గాయాన్ని లెక్కచేయని కోహ్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 17: రాయల్ చాలెంజర్స్ బెంగ ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బుధవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లే ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఎడమ చేతికి బలమైన గాయం తగిలింది. చేతి బొటనవేలు, చూపుడు వేలుకు మధ్య ఉన్న భాగం చిట్లడంతో ఏడెనిమిది కుట్లు కూడా వేశారు. అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే, ఈసారి ఐపిఎల్‌లో ప్లే ఆఫ్‌కు చేరే అవకాశాలను నిలబెట్టుకోవాలంటే బుధవారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ని తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉంది. అందుకే అతను గాయాన్ని లెక్కచేయకుండా, మ్యాచ్‌ని ఆడేందుకు సిద్ధమయ్యాడు. విశ్రాంతి తీసుకోవానికి కోహ్లీ సుముఖత వ్యక్తం చేయడం లేదని, పంజాబ్‌తో మ్యాచ్ ఆడాలని అతను నిర్ణయించుకున్నాడని బెంగళూరు జట్టు మేనేజర్, మాజీ రంజీ ఆటగాడు అవినాష్ వైద్య తెలిపాడు. జట్టుకు తన అవసరం ఉందని కోహ్లీ చెప్పాడని, గాయానికి బ్యాండేజీ వేసుకొని మైదానంలోకి దిగాలని అనుకుంటున్నాడని వైద్య చెప్పాడు. జట్టు ప్రయోజనాల కోసం కోహ్లీ దేనికైనా సిద్ధంగా ఉంటాడని అతని నిర ణయంతో మరోసారి రుజువైనట్టు వైద్య అన్నాడు.