క్రీడాభూమి

2019 జాతీయ క్రీడల నిర్వహణకు శాప్ కసరత్తు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 18: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జాతీయ క్రీడల నిర్వాహణకు శాప్ పాలకమండలి కసరత్తు ప్రారంభించింది. రాష్టమ్రంతటా జిల్లాలవారీగా నిర్వహిస్తున్న పర్యటనలో భాగంగా బుధవారం ఇక్కడ కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ (శాప్) అధ్యక్షుడు పిఆర్ మోహన్ అధ్యక్షతన 7వ పాలకమండలి సమావేశం జరిగింది. క్రీడాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సారథ్యం వహిస్తున్న జిల్లాలో జరిగిన ఈ సమావేశంలో క్రీడల అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019లో జాతీయ క్రీడలను రాష్ట్రంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని చైర్మన్ తొలి ప్రసంగంలో చెబుతూ అత్యంత ఎక్కువ బడ్జెట్‌గా 250 కోట్లు కేటాయించి ప్రభుత్వం జాతీయ క్రీడల నిర్వాహణను దృష్టిలోపెట్టుకున్నట్టు వివరించారు.
శ్రీకాకుళం జిల్లాలో వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని కరణం మల్లేశ్వరీ నేతృత్వంలో నెలకొల్పేందుకు మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండో దశలో అథ్లెటిక్స్ అకాడమీని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేయాలన్న మండలి సభ్యుల సూచనలను చైర్మన్ పరిశీలనలోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా లంబసింగిలో ఎతె్తైన ప్రదేశ క్రీడా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు చైర్మన్ మోహన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఉత్తరాధిలోగల శీతల ప్రాంతాల్లో క్రీడల్లో పాల్గొనేందుకు రాష్ట్ర క్రీడాకారులకు ఇబ్బందికరంగా ఉందని దానిని అధిగమించుటకు లంబసింగిలో ఈ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సంవత్సరం పొడవునా చల్లగా ఉంటే ఈ ప్రదేశంలో శిక్షణ ఇవ్వడం వల్ల ఇతర శీతల ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వాతావరణానికి తట్టుకోగల సామర్థ్యం క్రీడాకారులకు ఉంటోందన్న ఆలలోచనతో ఈ ప్రతిపాదన చేసినట్టు శాప్ మండలి తీర్మానించింది.
మూడు చోట్ల పక్కా మైదానాలు
తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ లేదా అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశంలో తీర్మానం జరిగింది. రాష్ట్రంలో జాతీయ క్రీడలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటూ, అందుకు కావల్సిన అంతర్జాతీయస్థాయిలో క్రీడాకారులకు కావల్సిన వౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నట్టు పాలక మండలి తీర్మానించింది.
తిరుపతిలో తుది సమావేశం
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరక్టర్ రేఖారాణి, చైర్మన్ పి.ఆర్.మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పాలక మండలి సమావేశాన్ని నిర్వహించి జిల్లాలవారీగా సదుపాయాలు ఏవిధంగా కల్పించాలన్న దానిపై తిరుపతిలో తుది సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. క్రీడా బడ్జెట్ ఏ విధంగా ఖర్చు చేయాలో ఈ నెల 23వ తేదీన క్రీడా బడ్జెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రం వేర్పాటు తర్వాత శ్రీకాకుళం జిల్లాకు ప్రప్రథమంగా స్టేడియం నిర్మాణానికి 15 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించినట్టు పేర్కొన్నారు. జాతీయ క్రీడల్లో భాగంగా శ్రీకాకుళంలో కూడా రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించే విధంగా స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
అరకులో స్పోర్ట్స్ హాస్టల్
విశాఖపట్నం అరకులో గిరిజనుల స్పోర్ట్స్ హాస్టల్స్ ఏర్పాటు చేసేందుకు తీర్మానించారు. అలాగే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సభ్యులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో 150 ఎకరాలతో స్థలాన్ని క్రీడల కోసం కేటాయించారు. రాష్ట్రంలో కోచ్‌ల కొరత వెంటాడుతోందని, ఎన్.ఐ.ఎస్ చేసిన వారు లేకపోయినప్పటికీ సీనియర్ క్రీడాకారులను శిక్షణ ఇచ్చి శిక్షకులుగా తీసుకుంటామని శాప్ చైర్మన్ వెల్లడించారు. సమావేశంలో బోర్డ్ సభ్యురాలు కరణం మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

శాప్ పాలక మండలి సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ మోహన్