క్రీడాభూమి

జట్టును ముందుండి నడిపించు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూన్ 19: భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొం టున్న పాకిస్తాన్ జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు మద్దతు తెలిపింది. పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహమ్మద్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పాకి స్తాన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం పాక్ చీఫ్ సెలెక్టర్ ఇషాన్ మనీ సర్షరాజ్‌కి ఫోన్ చేసి మాట్లాడినట్లు పేర్కొంది. భారత్‌తో ఓటమికి చింతించకుండా తర్వాతి మ్యాచ్‌లపై దృష్టి సారించాలని మనీ చెప్పారు. ఈ సందర్భంగా దేశం మొత్తం పాక్ జట్టుకు అండగా ఉందని, మీడియా ప్రసారమయ్యే వార్తల గురించి పట్టించుకోకుండా ఆట మీద ద్యాస పెట్టాలని ఆయన సూచించారు. అనవసర విషయా లకు స్పందించకుండా జట్టును ముందుండి నడిపించాలని సర్ఫరాజ్‌కు సూచించినట్లు సదరు మీడియా పేర్కొంది.
పాక్ జట్టును నిషేధించండి
టీమిండియా చేతిలో ఓడిపోయన పాకి స్తాన్ జట్టుకు స్వదేశంలో నిరసనల సెగ తగు లుతోంది. ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు ఆటగాళ్లపై విమర్శల వర్షం కురిపి స్తున్నారు. తాజాగా ఈ ఓటమిపై కోర్టు మెట్లు ఎక్కారు. భారత్‌పై ఓడిపోయనందుకు పాక్ జట్టును నిషేధించాలంటూ ఓ అభిమాని పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలా సివిల్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేకాకుండా ఓటమికి జట్టుతో పాటు సెలక్షన్ కమిటీపై కూడా నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన సివిల్ కోర్టు న్యాయమూర్తి దీనిపై నివేదికలు అందించాల్సిందిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.