క్రీడాభూమి

ఇంగ్లాండ్‌కు అర్జున్ సాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 24: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొంటున్న ఇంగ్లాండ్‌కు నెట్ బౌలర్‌గా అర్జున్ తెండూల్కర్ సాయం అందిస్తున్నాడు. తండ్రి సచిన్ తెండూల్కర్ బ్యాటింగ్ దిగ్గజమైతే, కుమారుడు అర్జున్ ఎడమచేతి మీడియం పేస్ బౌలర్. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో జరిగే ప్రతి మ్యాచ్‌నీ ఇంగ్లాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అన్ని విధాలా ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా అర్జున్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. అతను ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు నెట్ బౌలర్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. 2015 వరల్డ్ కప్ సమయంలో, 15 ఏళ్ల వయసులోనే అతను నెట్ బౌలర్ అవతారమెత్తాడు. యాషెస్ సిరీస్ సమయంలోనూ ఇంగ్లాండ్‌కు సహకరించాడు.