క్రీడాభూమి

గెలిస్తే సెమీస్‌కే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు గురు వారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా వెస్టిండీతో తలపడనుం ది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కావడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది.
రోహిత్, కోహ్లీపైనే..
భారత జట్టు ఈ మెగా టోర్నీలో వరుస విజ యాలతో దూసుకుపోతున్నా బ్యాటింగ్ విభాగంలో పూర్తిస్థాయి ప్రదర్శన కనబర్చలేకపో తోంది. గత మ్యాచులను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టంగా కనిపి స్తోంది. జట్టు మొత్తం కేవలం ఓపెనర్ రోహిత్ శర్మ. కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ వైఫల్యమే అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కనిపిం చింది. కెప్టెన్ కోహ్లీ, కేదార్ జాదవ్ అర్ధ సెంచ రీలతో రాణించకపోయనా, చివరి ఓవర్లలో బౌలింగ్ కట్టుది ట్టంగా వేసి ఉండకపోయినా పసికూన అఫ్గా నిస్తాన్ చేతిలో ఘోర పరాజయం పొందేవాళ్లం.
ధోనీ రాణించేనా..
మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆశించిన ప్రదర్శన చేయ లేదు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరీ దారు ణంగా 52 బంతులాడి కేవలం 28 పరుగులు మాత్రమే చేయడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతు న్నారు. గత ఐపీఎల్‌లోనూ ఇలాంటి ప్రదర్శనతోనే విమర్శలు ఎదుర్కొన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ధోనీ ఆటతీరుపై పెదవి విరిచాడు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా తనదైన శైలిలో ఆడాలని అభిమానులతో పాటు యావత్ భారత్ కోరు కుంటోంది.
మెప్పించని విజయ్ శంకర్..
ప్రపంచకప్‌కు ముందు జట్టులో నాలుగో స్థానం కోసం ఎవరిని ఎంపిక చేయాలో తెలియని పరిస్థితి. అయితే సెలక్షన్ కమిటీ ఆల్‌రౌండర్‌గా ఉపయోగ పడతాడనే ఒకే ఒక కారణంతో విజయ్ శంకర్‌కు అవ కాశం కల్పించింది. ఈ అవకాశాన్ని మాత్రం అతడు వినియోగించుకోవడంలో విఫలమవుతున్నాడు. అఫ్గా నిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనైనా రాణిస్తాడనుకున్నా, ఆ దిశగా ప్రయత్నమేమీ జరగలేదు. పాకిస్తాన్ జరిగిన మ్యాచ్‌లో మాత్రం భువనేశ్వర్ స్థానంలో బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. ఇక శిఖర్ ధావన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ మొదటి మంచి ప్రదర్శన చేసి ఫర్వాలేదనిపించినా, తన స్థాయ మేరకు రాణిస్తున్నాడు. టాప్ ఆర్డర్‌తో పా టు మిడిలార్డర్‌లో విజయ్ శంకర్, మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్ రాణిస్తే ప్రపం చకప్‌లో టీమిండియాకు తిరుగుండదు.
బౌలింగ్‌లో కంగారే లేదు..
భారత జట్టు బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, హార్దిక్ పాం డ్యా వంటి పేసర్లతో పాటు యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లతో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టిస్తోంది. అయితే కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయపడడం కొంత ఇబ్బందే అయనా, ఆ స్థానాన్ని షమీ భర్తీ విజయవంతంగా భర్తీ చేశాడు. అయితే తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న భువీ గాయం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తున్నా, విండీస్‌తో మ్యాచ్‌కు ఆడేది అనుమానమే.
తప్పక గెలవాల్సిందే..
టోర్నీలో సెమీస్ రేసులో నిలవాలంటే వెస్టిండీస్ జట్టు భారత్‌తో పాటు మిగతా మ్యాచ్‌లన్నీ గెలవాల్సిన పరిస్థితి. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై కేవలం 5 పరుగులతో తేడాతో ఓడిపోవడం విండీస్‌ను మరింత కుంగదీసింది. అయితే కరేబియాన్ల ఆశలన్నీ ఓపెనర్ క్రిస్ గేల్‌పైనే. గత మ్యాచ్‌ల్లో విఫలమైన గేల్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడాడు. అయినా త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మరోవైపు షై హోప్, నికోలస్ పూరన్, శిమ్రాన్ హెట్మయర్, కెప్టెన్ జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్‌వైట్ వంటి హార్డ్ హిట్టర్లు రాణిస్తే ప్రత్యర్థి జట్లపై విజయం సాధ్య మవుతుంది. ఇక బౌలింగ్ విభాగంలో షెల్డన్ కాట్రెల్, కీమర్ రోచ్, ఒషానె థామస్, అష్లీ నర్స్ తమ స్థాయ మేరకు రాణిస్తున్నారు. ఇప్పటికే టోర్నీలో ఆరు మ్యాచులాడిన విండీస్ కేవలం ఒక పాకిస్తాన్ జట్టుపైనే గెలిచి మూడు పాయంట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది.
భారత్- వెస్టిండీస్ జట్లు ప్రపంచకప్‌లో మొత్తం 8 సార్లు తలపడగా, 5 సార్లు టీమిండియా, 3 సార్లు వెస్టిండీస్ విజయం సాధించాయ.
1983 ప్రపంచకప్‌లో ఇరు జట్లు మూడు మ్యాచుల్లో పోటీ పడగా, విండీస్ ఒకసారి, రెండు సార్లు భారత్ గెలిచి మొదటిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ తర్వాత 1996, 2011తో పాటు గత ప్రపంచకప్‌లోనూ టీమిండియానే విజయం వరించింది.
వెస్టిండీస్ 1979, 1983, 1996లలో జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌పై విజేతగా నిలిచింది.

వాన ముప్పు లేదు..
భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. వాతా వరణం పొడిగా ఉందని, వర్షం పడే అవకాశా ల్లేవని స్పష్టం చేసింది. ఇప్పటికే వర్షంతో నాలుగు మ్యాచ్‌లు రద్దయన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. వె స్టిండీస్ జట్టు సెమీస్ రేస్‌లో నిలవాలంటే గెలుపు తప్ప నిసరి. ముఖ్యంగా పాయం ట్లలో కేవలం 3 పాయంట్లతో 8వ స్థానంలో ఉం ది. మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా సెమీస్ చేరుకునే అవ కాశముంది. ఇప్పటివరకు 5 మ్యాచుల్లో నాలు గింట గెలిచిన టీమిండియా 9 పాయంట్లతో మూ డో స్థానంలో కొనసాగుతోంది.

చిత్రాలు.. నెట్స్‌లో బౌలింగ్ సాధన చేస్తున్న జస్ప్రీత్ బుమ్రా
*క్రిస్ గేల్ *జాసన్ హోల్డర్