క్రీడాభూమి

ఇంగ్లాండ్ చేతిలో లంక చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, మే 21: ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నిం గ్స్ 88 పరుగుల తేడాతో చిత్తయంది. పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యా టింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 298 పరు గులు సాధించింది. అందుకు సమాధానంగా లంక మొ దటి ఇన్నింగ్స్‌లో 91 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్ 16 పరుగు లకు 5 వికెట్లు పడగొట్టగా, స్టువర్ట్ బ్రాడ్ 21 పరుగు లిచ్చి 4 వికెట్లు కూల్చాడు. అనంతరం ఫాలోఆన్‌కు దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమై 119 పరు గులకు ఆలౌటైంది. కుశాల్ మేండిస్ 53 పరుగులతో రా ణించాడు. కుశాల్ సిల్వ (14), లాహిరు తిరిమానే (16) తప్ప ఎవరూ డబుల్ ఫిగర్స్‌ను కూడా చేరుకోలేకపోయా రు. ఆండర్సన్ 29 పరుగులకు ఐదు వికెట్లు సాధించాడు. ఫిన్ 26 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు.