క్రీడాభూమి

తిరుగులేని బోల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్ట్రావా, మే 21: ప్రపంచ నంబర్ వన్ స్ప్రింటర్, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు. ఇక్కడ జరిగిన చెక్ గోల్డెన్ స్పైక్ పోటీల్లో 100 మీటర్ల పరుగును 9.98 సెకన్లలో పూర్తి చేసిన బోల్డ్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఈఏడాది ఆగస్టులో రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌లోనూ విజయం తనదేనని పరోక్షంగా సంకేతాలు పంపాడు. 29 ఏళ్ల బోల్ట్ ఫిట్నెస్‌పై ఇటీవల కొంతకాలంగా అనుమానాలు తలెత్తుతున్నాయి. అతను ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, తనకు ఫిట్నెస్ సమస్య లేదని అతను తాజా విజయంతో రుజువు చేశాడు.

చిత్రం చెక్ గోల్డెన్ స్పైక్ 100 మీటర్ల స్ప్రింట్‌లో లక్ష్యం దిశగా దూసుకెళుతున్న ఉసేన్ బోల్ట్