క్రీడాభూమి

అదే జోరు సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్: ఈసారి వరల్డ్ కప్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తున్న టీమిండియాకు మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్లోనూ అదే జోరు సాధ్యమా? ప్రత్యర్థి బౌలింగ్ విభాగం బలంగా ఉంది కాబట్టి, ఆచితూచి ఆడక తప్పదా? పరుగుల వరద పారించడం భారత టాపార్డర్‌కు సులభమేనా? లేక పరుగుల కోసం తంటాలు పడుతుందా? భారత క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలివి. గ్రూప్ దశలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఉండగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆది న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ కావడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్, ఆతర్వాత పటిష్టమైన, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 89 పరుగుల తేడాతో ఓడించి, వరల్డ్ కప్‌లో ఆ జట్టుపై తన అజేయ రికార్డును కొనసాగించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, మూడు తిరుగులేని విజయాల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు కొంత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించారు. ఫలితంగా అఫ్గానిస్తాన్‌తో అతి కష్టం మీద, కేవలం 11 పరుగుల తేడాతో విజయం సాధ్యమైంది. ఈ పరిణామంతో కంగుతిన్న భారత్ ఆతర్వాత వెస్టిండీస్‌ను 125 పరుగుల తేడాతో చిత్తుచేసింది. అయితే, ఆ విజయంతో ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేసి, మూల్యాన్ని చెల్లించుకుంది. 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అనంతరం బంగ్లాదేశ్ కూడా భారత్‌కు గట్టిపోటీనిచ్చింది. ఆ జట్టు 28 పరుగుల తేడాతో ఓడినప్పటికీ, భారత్‌కు ఓ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఏ జట్టునూ నిర్లక్ష్యం చేయకూడదన్న వాస్తవాన్ని తెలియచెప్పింది. దీనికితోడు, ఇంగ్లాండ్ చేతిలో ఓడినప్పుడు భారత బ్యాటింగ్ తీరుపై వచ్చిన విమర్శలు కూడా ఆటగాళ్లలో పట్టుదలను పెంచాయి. జట్టు కూర్పు నుంచి అనుసరించాల్సిన వ్యూహాల వరకూ ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు తీసుకున్న భారత్ చివరి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఏకంగా 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ భారీ భాగస్వామ్యం, ఇద్దరూ సెంచరీలు చేయడం విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పదింతలు చేసింది. అయితే, భారీ విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఏమరుపాటుగా ఉండడం, ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా చూడడం వంటి లక్షణాలు కోహ్లీ సేనకు ఆనవాయితీగా మారాయి. లంకను చిత్తుచిత్తుగా ఓడించిన నేపథ్యంలో, న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్లోనూ టీమిండియా అదే తీరుతో వ్యవహరిస్తుందా? అనే అనుమానం అభిమానులను పీడిస్తున్నది. అయితే, పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, విశే్లషకులు భారత్‌ను హాట్ ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు.
నిజానికి చివరి గ్రూప్ మ్యాచ్‌లో, అప్పటి వరకూ దారుణంగా విఫలమైన దక్షిణాఫ్రికాను ఓడించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుందని అభిమానులు ఊహించారు. విశే్లషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ, అందుకు భిన్నంగా దక్షిణాఫ్రికా విజయభేరి మోగించడంతో, ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది. దీనితో, టాప్ టెన్‌లో చివరి స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో భారత్ సెమీస్ ఖాయమైంది.

బౌలర్ల సత్తా
ఈ టోర్నీలో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. పరుగుల వరద పారింది. అయితే, కొన్ని మ్యాచ్‌ల్లో బౌలర్లు సత్తా చాటారు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లు గొప్పగా బౌల్ చేశారు. భారత జట్టులో ఎడమచేతి వాటం పేసర్ లేకపోయినప్పటికీ, బౌలర్లంతా ఎంతో పడక్బందిగా బంతులు వేశారు. అందుకే వీరి బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్ ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. స్ట్రయిక్ రేట్‌లో భారత బౌలర్లే మెరుగ్గా ఉండడం విశేషం. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు.

సగటున ఒక వికెట్‌కు తక్కువ పరుగులు
జట్టు ఓవర్లు స్ట్రయిక్ రేట్ జట్టు ఓవర్లు స్ట్రయిక్ రేట్
భారత్ 372.1 33.3 వెస్టిండీస్ 352.5 39.2
న్యూజిలాండ్ 367 33.8 బంగ్లాదేశ్ 394.1 40.0
ఆస్ట్రేలియా 418.1 33.9 అఫ్గానిస్తాన్ 382.1 48.7
ఇంగ్లాండ్ 428.2 35.2 శ్రీలంక 276.4 48.8.
పాకిస్తాన్ 356.5 35.6 దక్షిణాఫ్రికా 379.3 37.9

తిరుగులేని ‘టాప్-3’
వరల్డ్ కప్‌లో మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్ సాధించిన పరుగుల జాబితాలో భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ, నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 2015 ప్రపంచ కప్ నుంచి ఈ వరల్డ్ కప్ ప్రారంభం వరకూ జరిగిన వనే్డల్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ విరాట్ కోహ్లీ తో కూడిన ‘టాప్-3’ బృందం భారత్ సాధించిన మొత్తం పరుగుల్లో 52 శాతం పరుగులను అందించారు. ఇదే కాలంలో మొత్తం 51 సెంచరీలు నమోదుకాగా, వాటిలో ఈ ముగ్గు రూ చేసి న శతకాలు 42. ఇలావుంటే, ఈ వరల్డ్ కప్ మ ధ్యలో శిఖర్ ధావన్ గాయంకారణంగా టోర్నీకి దూరంకాగా, ఆ స్థానాన్ని లోకేష్ రాహు ల్ సమర్థంగా భర్తీ చేశాడు. మొత్తం మీద ‘టాప్-3’ బ్యా ట్స్‌మెన్ కలిసి జట్టు స్కోరులో 69 శాతం పరుగులను సాధించిపెట్టారు. న్యూజిలాండ్‌పై సెమీస్‌లో టీమిండియా ‘టాప్-3’ ఇదే దూకుడును కొనసాగిస్తుందన్నది అభిమానుల నమ్మకం.

‘టాప్-3’ బ్యాట్స్‌మెన్
సాధించిన పరుగులు..
జట్టు పరుగులు
భారత్ 1,537
ఆస్ట్రేలియా 1,480
ఇంగ్లాండ్ 1,383
దక్షిణాఫ్రికా 1,002
బంగ్లాదేశ్ 1,020
పాకిస్తాన్ 965
న్యూజిలాండ్ 780
శ్రీలంక 743
వెస్టిండీస్ 684
అఫ్గానిస్తాన్ 648

మొదటి పవర్ ప్లే కీలకం

భారత జట్టుకు మంగళవారం కివీస్‌తో జరిగే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మొదటి పవర్ ప్లే కీలకంగా మారనుంది. టోర్నమెంట్‌లో ఇంత వరకూ రికార్డయిన మొదటి పవర్ ప్లే సగటు 4.93 పరుగులు. అయితే, టీమిండియా సగటు 4.65 పరుగులు. ఈ లోపాన్ని భారత్ సరిదిద్దుకోవాలి.

గ్రూప్ దశలో వివిధ జట్లపై టీమిండియా
మొదటి పవర్ ప్లేలో నమోదు చేసిన పరుగులు..
జట్టు పరుగులు
బంగ్లాదేశ్ 69
శ్రీలంక 59
పాకిస్తాన్ 53
వెస్టిండీస్ 47
ఆస్ట్రేలియా 41
అఫ్గానిస్తాన్ 41
దక్షిణాఫ్రికా 34
ఇంగ్లాండ్ 28

హెడ్ టు హెడ్
పరస్పరం ఆడిన మ్యాచ్‌లు 8
భారత్ విజయాలు 3
న్యూజిలాండ్ గెలిచినవి 4
‘టై’గా ముగిసినవి 0
ఫలితం తేలనివి 1

చిత్రాలు.. *లోకేష్ రాహుల్
*నెట్స్‌కు ముందు వర్కవుట్‌లో ఆటవిడుపు: రిషభ్ పంత్